STOCKS

News


గంటకు 15 డాలర్లు!

Wednesday 3rd October 2018
news_main1538542516.png-20810

సియాటిల్: ఆన్‌లైన్‌ రిటైల్ దిగ్గజం అమెజాన్‌.. అమెరికాలోని తమ సిబ్బంది కనీస వేతనాలను పెంచింది. వచ్చే నెల నుంచి గంటకు 15 డాలర్ల (సుమారు రూ.1,050) చొప్పున కనీస వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 3,50,000 మంది ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌, తాత్కాలిక ఉద్యోగులకు దీనితో ప్రయోజనం చేకూరనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఇప్పటికే గంటకు 15 డాలర్ల వేతనం పొందుతున్నవారికి కూడా తగు స్థాయిలో పెంపు ఉంటుందని తెలిపింది. కంపెనీలో పై స్థాయి, కింది స్థాయి ఉద్యోగుల వేతనాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సరిదిద్దాలంటూ ఆర్థిక, రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా రిటైల్ సంస్థలు కూడా క్రమంగా కనీస వేతనాలను క్రమంగా పెంచుతున్నాయి. వాల్‌మార్ట్‌ ఈ మధ్యే జనవరిలో తమ సిబ్బంది కనీస వేతనాలను గంటకు 11 డాలర్లకు పెంచగా, మరో రిటైల్ సంస్థ టార్గెట్ 2020 నాటికల్లా గంటకు 15 డాలర్ల కనీస వేతన స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ‘‘కనీస వేతనాన్ని 15 డాలర్లకు పెంచేలా ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం ఉన్న 7.25 డాలర్లనేది ఎప్పుడో 11 ఏళ్ల కిందట తెచ్చిన చట్టం. అప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. అందుకే మేం 15 డాలర్లకు పెంచుతున్నాం’’ అని అమెజాన్‌ స్పష్టంచేసింది. కనీసం గంటకు 15 డాలర్లు చెల్లించాలన్న ఉద్యమం ఇపుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకోవటం గమనార‍్హం.



You may be interested

జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు..!

Wednesday 3rd October 2018

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు వచ్చే నెలలో రూ.లక్ష కోట్లను మించిపోయే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో జీఎస్‌టీ ఆదాయం లక్ష కోట్ల మార్కును దాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. పండుగల సీజన్‌ కావడం వల్ల ఈ రెండు నెలల్లో వస్తు, సేవల డిమాండ్‌ పెరిగి వసూళ్లు ఊపందుకోనున్నాయని భావిస్తోన్న ఆర్థిక

ఈసారి మళ్లీ లాభాల్లోకి ..

Wednesday 3rd October 2018

తిరువనంతపురం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని, వృద్ధి బాట పట్టగలమని ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎండీ సునీల్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకును ముంచేసిన నీరవ్ మోదీ స్కామ్ ఇక ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రూ.13,000 కోట్ల మోదీ స్కామ్‌తో కుదేలైన పీఎన్‌బీ .. ఇంకా ఆ ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెహతా వ్యాఖ్యలు ప్రాధాన్యం

Most from this category