STOCKS

News


అమరరాజా మధ్యంతర డివిడెండు 200 శాతం

Saturday 10th November 2018
news_main1541828956.png-21850

అమరరాజా బ్యాటరీస్‌ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.127 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,440 కోట్ల నుంచి రూ.1,767 కోట్లకు ఎగసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరు 9 లోగా ఈ మొత్తాన్ని చెల్లించనుంది. రూ.540 కోట్ల మూలధన వ్యయానికి బోర్డు సమ్మతించింది. ఈ మొత్తాన్ని అడ్వాన్స్‌డ్‌ స్టాంపెడ్‌ గ్రిడ్‌ టెక్నాలజీ, టూ వీలర్‌ బ్యాటరీ ప్లాంటులో రెండవ పంచింగ్‌ లైన్‌, ఎంవీఆర్‌ఎల్‌ఏ ప్లాంటు విస్తరణకు వెచ్చిస్తారు. శుక్రవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 1.06 శాతం తగ్గి రూ.771.80 వద్ద స్థిరపడింది.



You may be interested

రూ.3,000 కోట్లను సమీకరించిన ఆర్‌ఐఎల్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్‌ సెక్యూర్డ్‌, నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 2028 నవంబర్‌ 9న ఇవి గడువు తీరతాయని పేర్కొంది. ఇంధనం, పెట్రోకెమికల్‌, రిటైల్‌, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో

ఐఓబీ వడ్డీరేట్లు పెరిగాయ్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ) బెంచ్‌ మార్క్‌ లెండింగ్‌రేట్‌ను 5 బేసిస్‌ పాయింట్లు పెంచింది.దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్‌డ్‌ లెండింగ్‌రేట్‌(ఎమ్‌సీఎల్‌ఆర్‌)ను 0.05 శాతం పెంచుతున్నామని ఐఓబీ తెలిపింది. ఈ పెరుగుదల నేటి(శనివారం) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. రెండేళ్ల కాల పరిమితి ఉన్న రుణాలపై వడ్డీరేటు 8.8 శాతం నుంచి 8.85 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. అలాగే

Most from this category