STOCKS

News


13 శాతం పెరిగిన అమర రాజా లాభం

Monday 13th August 2018
news_main1534136389.png-19201

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
జూన్‌ త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.113 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.1,685 కోట్ల నుంచి రూ.1,792 కోట్లకు ఎగసింది. 65 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో రూ.700 కోట్లతో నెలకొల్పనున్న ఆటోమోటివ్‌ బ్యాటరీ ప్లాంటుకై బోర్డు అనుమతించిందని కంపెనీ సీఈవో ఎస్‌.విజయానంద్‌ తెలిపారు. 



You may be interested

19 బిలియన్ డాలర్లకు ఫార్మా ఎగుమతులు

Monday 13th August 2018

హైదరాబాద్‌: కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫార్మా ఎగుమతులు 19 -20 బిలియన్ డాలర్ల స్థాయిని దాటవచ్చని ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మాక్సిల్) అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఫార్మా ఎగుమతులు 2.92 శాతం వృద్ధితో 17.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌ నుంచి ఆల్టర్నేటివ్ ఫండ్‌...

Monday 13th August 2018

ఫ్రాంక్లిన్ టెంపుల్వ్‌ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌టీఏఐ) తాజాగా తమ తొలి ఫండ్ 'ఫ్రాంక్లిన్ ఇండియా లాంగ్ షార్ట్ ఈక్విటీ ఏఐఎఫ్‌'ను ప్రవేశపెట్టింది. పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌పై అవగాహన ఉండి, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో మరింతగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికోసం దీన్ని ఉద్దేశించినట్లు  ఎఫ్‌టీఏఐ ప్రెసిడెంట్ నాగనాథ్ సుందరేశన్ తెలిపారు. దేశీ సంస్థల ఈక్విటీ, డెరివేటివ్స్‌ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్య, దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు అందించడం, పెట్టుబడుల విలువ

Most from this category