STOCKS

News


85 శాతం పన్ను చెల్లింపుదారులకు లాభం

Saturday 2nd February 2019
news_main1549100881.png-23969

  • తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో 85 శాతం మంది పన్నుచెల్లింపుదారులు ప్రయోజనం పొందుతారని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. 2019-20 తాత్కాలిక బడ్జె‌ట్‌లో ప్రతిపాదించిన విధానాలు, రాయితీలతో మధ్య తరగతి కుటుంబాలు, రైతులు, పేదవర్గాలు లబ్ధి పొందుతారని ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘ఇది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన బడ్జెట్‌ కాదు. నాలుగున్నరేళ్లుగా మేం ఈ అంశాలపై నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాం’అని మంత్రి అన్నారు. ప్రధాని చెబుతున్నట్లు ‘అందరితో కలిసి అందరికీ ప్రగతి ఫలాలు’ అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య, పశుపోషణ రంగాల్లో పనిచేసే వారందరి కోసం ఈ బడ్జెట్‌ను రూపొందించాం. మధ్య తరగతి కొనుగోలు శక్తి పెరగడానికి, వస్తు, సేవల వినియోగం, అభివృద్ధికి కృషి చేశాం’ అని ఆయన వివరించారు. దేశ చరిత్రలోనే మొదటిసారి మొత్తం 22 వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామంటూ మంత్రి.. ఇది కాకుండా పేద రైతులకు ఏటా రూ.6 వేల కోట్ల మేర మేలు చేకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాలను సానుకూల దృక్పథంతో చూడాలని కోరారు. ‘రైతులకు ఇచ్చేది భృతి వంటిది కాదు. ఇది గౌరవం. ఇది చిన్న, సన్నకారు రైతులకు కల్పించిన ‘సమ్మాన్‌(గౌరవం) నిధి’. అరెకరం, ఒకటి, రెండు ఎకరాలు, గరిష్టంగా ఐదెకరాల పొలం ఉన్న రైతులు ఇలాంటి సాయం పొందాల్సిన స్థితిలో ఉన్నారు’ అని మంత్రి గోయెల్‌ వివరించారు.



You may be interested

రైల్వేకు 1.58 లక్షల కోట్ల మూలధన వ్యయం

Saturday 2nd February 2019

చరిత్రలో ఇదే అత్యధికం బడ్జెట్‌లో 64 వేల కోట్ల కేటాయింపులు కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లన్నీ ఎత్తేశాం: గోయల్‌ న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊహించినట్లుగానే రైల్వే చార్జీల పెంపు లేకుండానే తాజా బడ్జెట్‌ వచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనంత మూలధన ‍వ్యయాన్ని ఈ బడ్జెట్‌లో రైల్వేకు కేటాయించారు. గతేడాది అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా రూ. 1.48 లక్షల కోట్లను రైల్వేకు కేటాయించగా, ప్రస్తుతం దాన్ని

ఎన్నికల అనంతరమే క్రెడిట్‌ రేటింగ్‌ రివ్యూ

Saturday 2nd February 2019

భారత క్రెడిట్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌పై ఫిచ్‌  ఎన్నికల అనంతరం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ ఆధారంగానే భారత క్రెడిట్‌ సావరిన్‌ రేటింగ్‌ ప్రొఫైల్‌ను మదింపు చేస్తామని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఎన్నికల మందు వ్యయాలు పెరగడంతో విత్త స్లిపేజ్‌ కాస్త పెరిగిందని తెలిపింది. విత్తలోటు 0.1 శాతం పెరిగవచ్చని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ముందు అనుకున్న అంచనా 3.3 శాతం కాకుండా

Most from this category