STOCKS

News


అలహాబాద్‌ బ్యాంక్‌ నష్టం @ 1,822 కోట్లు

Tuesday 13th November 2018
news_main1542101031.png-21954

అలహాబాద్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్ధిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ రూ.1,822 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కాగా బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.70 కోట్ల నికర లాభాన్ని సాధించింది. వార్షికంగా చూస్తే ఈ క్యూ2లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ.1,254 కోట్ల నుంచి రూ.1,150 కోట్లకు తగ్గింది. రుణ నాణ్యత మరింత క్షీణించింది. స్థూల ఎన్‌పీఏలు 17.53 శాతానికి పెరిగాయి. జూన్‌ త్రైమాసికంలో ఇవి 15.97 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 7.96 శాతానికి పెరిగాయి. జూన్‌ క్వార్టర్‌లో ఇవి 7.32 శాతంగా ఉన్నాయి. విలువ ప్రకారం చూస్తే.. క్వార్టర్‌ పరంగా స్థూల ఎన్‌పీఏలు రూ.25,068 కోట్ల నుంచి రూ.27,236 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో నికర ఎన్‌పీఏలు రూ.10,410 కోట్ల నుంచి రూ.11,083 కోట్లకు చేరాయి.  

క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అలహాబాద్‌ బ్యాంక్‌ షేరు ధర మధ్యాహ్నం 2:51 సమయంలో ఏకంగా 13 శాతం క్షీణతతో రూ.36 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

నెలరోజుల కోసం 5 సిఫార్సులు

Tuesday 13th November 2018

ముంబై: 10,600 స్థాయిలో బలమైన నిరోధాన్ని ఎదుర్కొటున్న నిఫ్టీ ఈ స్థాయి ఎగువన నిలవలేకపోతుందని, ఈ సూచీ తక్షణ మద్దతు 10,440 వద్ద ఉందని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ ఆశిష్‌ చతుర్‌మెహతా అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 10,260 పాయింట్ల వద్ద.. ఆ తరువాత మద్దతు 10,030 దగ్గర ఉన్నట్లు విశ్లేషించారు. 10,600 స్థాయిని అధిగమించిన పక్షంలో 10750-10850 స్థాయిలో నిరోధం ఎదురవుతుందన్నారు.

వోకార్డ్‌ లిమిటెడ్‌ 8శాతం డౌన్‌ .!

Tuesday 13th November 2018

ఫార్మా రంగానికి చెందిన వోకార్డ్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం 8.50శాతం నష్టపోయింది. అమెరికా కోర్టు వోకార్డ్‌ లిమిటెడ్‌కు చెందిన ‘‘జైటిగా’’ ఔషధంపై పేటెంట్‌ హక్కులను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు తీర్పునిచ్చిందనే వార్తలు వెలుగులోకి రావడంతో షేరు ధర పతనమైంది. వోకార్డ్‌ కంపెనీ ఆదాయం ఆర్జనలో అధికభాగమైన ‘‘జైటిగా’’ జనరిక్‌ ఔషధాన్ని పురుషుల్లో సంక్రమించే ప్రోస్టెట్‌ కాన్సర్‌ చికిత్సలో వినియోగిస్తారు. మరోవైపు నేడు ఫార్మా షేర్లలో వెలువెత్తిన అమ్మకాలు సైతం షేరు క్షీణతకు దోహదపడ్డాయి. నేడు

Most from this category