News


హోండా సివిక్‌లో కొత్త వేరియంట్‌

Friday 8th March 2019
news_main1552026202.png-24492

ధర రూ.17.7 - 22.3 లక్షల మధ్య
న్యూఢిల్లీ: హోండా కార్స్‌ ఇండియా సివిక్‌ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. సివిక్‌ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలలో అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్‌ వెర్షన్‌లో 1.8 లీటర్‌ సీవీటీ (ఆటోమేటిక్‌) ట్రాన్సిమిషన్‌, డీజిల్‌ వెర్షన్‌లో 1.6 లీటర్‌ మాన్యువల్‌ సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్సిమిషన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గకు నకానిషి  చెప్పారు. పెట్రోల్‌ వేరియంట్‌ ధరలు రూ.17.7 లక్షల నుంచి రూ.21 లక్షలు, డీజిల్‌ వేరియంట్‌ ధరలు రూ.20.5 లక్షల నుంచి రూ.22.3 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. 2006లో సివిక్‌ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, 2013 వరకూ 55,000 కార్లను విక్రయించామని తెలిపారు. 2013లో సివిక్‌ విక్రయాలను ఆపేశామని, మళ్లీ ఇప్పుడు తెస్తున్నామని పేర్కొన్నారు. తాజా మోడల్‌తో సెడాన్‌ సెగ్మెంట్లో వివిధ ధరల రేంజ్‌లో మోడళ్లను తెచ్చామని, ఇక ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ సెడాన్‌ సెగ్మెంట్లో అమేజ్‌, సిటీ, అకార్డ్‌ మోడళ్లను విక్రయిస్తోంది. ఇక ఎస్‌యూవీ సెగ్మెంట్లో డబ్ల్యూ-ఆర్‌వీ, మిడ్‌ సైజ్‌ బీ-ఆర్‌వీ, టాప్‌ ఎండ్‌ సీ-ఆర్‌వీ మోడళ్లను విక్రయిస్తోంది. 
అమ్మకాలు 8 శాతం వృద్ధి ! 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి కాలానికి వాహర విక్రయాలు 6.5 శాతం మేర వృద్ధి చెందాయని నకానిషి తెలిపారు. ఈ నెలలో 17,000 కార్ల విక్రయాలు జరుగుతాయని అంచనాలున్నాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో వాహన విక్రయాలు 8 శాతం వృద్ధితో 1.8 లక్షలకు పెరగగలవన్న అంచనాలున్నాయని చెప్పారు.  అమేజ్‌ మోడల్‌ కారణంగా ఈ స్థాయి వృద్ధి సాధిస్తామని వివరించారు.



You may be interested

2నెలల గరిష్టానికి రూపాయి: నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 8th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి విలువ 2నెలల గరిష్టానికి చేరుకోవడంతో ఐటీ షేర్లు శుక్రవారం నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు దాదాపు 1.50శాతానికి పైగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరల పతనం, భారత్‌-పాక్‌ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సద్దుమణగడం, దేశీయ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, డాలర్‌ ఇండెక్స్‌ స్తబ్దుగా బలహీనత తదితర కారణాలు రూపాయి

పెనాల్టీలకు బ్యాంక్‌ల లోపాలే కారణం: స్విఫ్ట్‌

Friday 8th March 2019

ముంబై: బ్యాంకుల ఆటోమేటెడ్ చెల్లింపు విధానాల్లో లోపాల కారణంగానే వాటిపై రిజర్వ్ బ్యాంక్ జరిమానాలు విధించిందని, తమ వ్యవస్థ వైఫల్యం కాదని స్విఫ్ట్‌ సీఈవో (ఆసియా పసిఫిక్, ఈఎంఈఏ విభాగం) అలెయిన్ రేస్ చెప్పారు. తాము అన్ని బ్యాంకులను పర్యవేక్షించలేమని చెప్పారాయన. అంతర్జాతీయంగా చెల్లింపులకు బ్యాంకులు ఉపయోగించే స్విఫ్ట్ మెసేజింగ్‌ విధానాన్ని సక్రమంగా అమలు చేయనందుకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 19 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ.40 కోట్ల

Most from this category