STOCKS

News


రిటైర్మెంట్ కాదు.. వారసత్వ ప్రణాళికే..

Monday 10th September 2018
news_main1536556869.png-20115

బీజింగ్‌: ఆలీబాబా గ్రూప్‌ చైర్మన్‌ జాక్‌ మా సోమవారం రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ వచ్చిన వార్తలను ఆ కంపెనీ ఖండించింది. తన వారసుడి ఎంపిక ప్రణాళిక గురించి మాత్రమే ఆయన ప్రకటన చేయనున్నారని, రాబోయే రోజుల్లోనూ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జాక్‌ మానే కొనసాగుతారని కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. సోమవారం 54వ పుట్టినరోజు సందర్భంగా  జాక్‌ మా రిటైర్మెంట్‌ ప్రకటించనున్నారని, ఇకపై దాతృత్వ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నారని ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన ఇంటర్వ్యూ, కథనం అంతర్జాతీయంగా కార్పొరేట్‌ వర్గాలను ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. సంస్థ పగ్గాలను క్రమంగా కొత్త తరానికి అందించే వ్యూహంలో భాగంగానే సోమవారం తన వారసుడి ఎంపిక ప్రణాళికను ప్రకటిస్తానని జాక్‌ మా చెప్పారే తప్ప రిటైరవుతానని చెప్పలేదని ఆలీబాబా వర్గాలు పేర్కొన్నాయి. ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. మరోవైపు, ది న్యూయార్క్‌ టైమ్స్‌ తాము ప్రచురించిన కథనానికి కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసింది.

రిటైరయితే భారత్‌పై ప్రభావం ఏంటంటే..
నేరుగా ఆన్‌లైన్‌ మార్కెట్లో లేనప్పటికీ ఆలీబాబా.. వివిధ మార్గాల్లో భారత వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌ చేసింది. డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం పేటీఎంలో, ఆలీబాబా క్లౌడ్‌ ద్వారా క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో, యూసీవెబ్‌ ద్వారా డిజిటల్‌ మీడియా విభాగంలో.. ఇలా అనేక పెట్టుబడులు పెట్టింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ)తో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత ఈకామర్స్‌ విభాగం ఊపందుకుంటున్న నేపథ్యంలో రిలయన్స్‌ రిటైల్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలని జాక్‌ మా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే.. రిటైల్‌ రంగంలో ఆలీబాబాకు గట్టి పట్టే లభించవచ్చు. ఇక జాక్‌ మా వ్యక్తిగత సంపద విలువ దాదాపు 40 బిలియన్‌ డాలర్ల పైమాటే. తన స్వచ్ఛంద సంస్థ జాక్‌ మా ఫౌండేషన్‌ ద్వారా విద్యావ్యాప్తిపై ఆయన కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్‌ గేట్స్‌ వంటి మిగతా బిలియనీర్స్‌ బాటలోనే జాక్‌ మా కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను భారత్‌కు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  You may be interested

వాణిజ్య యుద్ధం, రూపాయి కదలికలపై దృష్టి

Monday 10th September 2018

స్థూల గణాంకాల వెల్లడి ఈ వారంలో సూచీల దిశానిర్థేశం చేయనున్నట్లు మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి, అమెరికా-చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ పరిణామాలు సూచీలకు కీలకంకానున్నాయని డెల్టా గ్లోబల్‌ పాట్నర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి వివరించారు. ఈ సమాచారం ఆధారంగానే అక్టోబరులో సమావేశంకానున్న ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షను వెల్లడించనుందన్నారు. వడ్డీ రేట్ల ప్రకటనకు కీలకంగా

రిస్క్‌, రాబడుల మధ్య సమతుల్యం

Monday 10th September 2018

మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా కాస్తంత రిస్క్‌ తగ్గించుకుని, మెరుగైన రాబడులు అందుకోవాలనుకునే వారికి మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం అనకూలంగా ఉంటుంది. హైబ్రిడ్‌ పథకంగా మొత్తం పెట్టుబడుల్లో 65-80 శాతం మేర ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌

Most from this category