STOCKS

News


జీఎస్‌ఎంఏ బోర్డులో 3 దేశీ టెల్కో దిగ్గజాలు

Tuesday 13th November 2018
news_main1542085420.png-21932

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య జీఎస్‌ఎంఏ బోర్డులో మూడు దేశీ ప్రైవేట్‌ టెల్కో దిగ్గజాలు చోటు దక్కించుకున్నాయి. భారతి ఎయిర్‌టెల్‌ ఎ౾ండీ, సీఈవో గోపాల్ విఠల్‌, రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్‌, వొడాఫోన్ గ్రూప్ సీఈవో (ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం) వివేక్ బద్రినాథ్ జీఎస్‌ఎంఏ బోర్డు సభ్యులుగా ఎంపికయ్యారు. వొడాఫోన్ ఐడియా బోర్డులో బద్రినాథ్‌ నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కూడా ఉన్నారు. దీంతో మొత్తం మూడు ప్రధానమైన దేశీ ప్రైవేట్ టెల్కో దిగ్గజాలకు జీఎస్‌ఎంఏ బోర్డులో చోటు దక్కినట్లయింది. వీరంతా జీఎస్‌ఎంఏ బోర్డులో 2019-2020 కాలవ్యవధికి సభ్యులుగా ఉంటారు. సోమవారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్త చైర్మన్‌గా ఆరెంజ్‌ గ్రూప్ చీఫ్‌ స్టెఫాన్ రిచర్డ్‌, సింగ్‌టెల్ గ్రూప్ సీఈవో చువా సాక్‌ కూంగ్‌ డిప్యుటీ చైర్‌గా వ్యవహరిస్తారు. భారతి ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ ప్రస్తుతం జీఎస్‌ఎంఏ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఆఖరుతో ముగుస్తుంది. జీఎస్‌ఎంఏలో ప్రస్తుతం 750 పైచిలుకు మొబైల్ ఆపరేటర్లకు సభ్యత్వం ఉంది. ఇటీవలే భారత్‌లో ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభించింది.



You may be interested

మార్చిలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌

Tuesday 13th November 2018

సియోల్‌: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా తమ తొలి ఫోల్డబుల్ (మడతపెట్టేందుకు అనువైన) స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టాలని దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యోచిస్తోంది. గెలాక్సీ ఎస్‌10లో 5జీ వెర్షన్‌తో పాటు దీన్ని కూడా ఆవిష్కరించాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఫిబ్రవరిలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో గెలాక్సీ ఎఫ్‌ పేరుతో ఈ ఫోన్‌ను ప్రదర్శించే అవకాశముందని వివరించాయి. దీని ధరను కంపెనీ ఇంత

59 శాతం పెరిగిన గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ లాభం

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ నికర లాభం కన్సాలిటేడెట్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 59 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.119 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.190 కోట్లకు పెరిగిందని గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.58 కోట్లుగా ఉన్న పన్ను వ్యయాలు ఈ

Most from this category