STOCKS

News


ద్విచక్ర వాహన బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్

Saturday 20th April 2019
news_main1555739720.png-25243

న్యూఢిల్లీ: టూవీలర్‌ బీమా సేవల్లోకి ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కూడా అడుగుపెట్టింది. భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో ఈ సేవలను అందించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 40,000 ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పాయింట్లు, మైఎయిర్‌టెల్‌ యాప్‌లో ఆకర్షణీయమైన ద్విచక్ర వాహన బీమా ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలియజేసింది. ‘‘వ్యక్తిగత ప్రమాద బీమా, థార్డ్‌ పార్టీ లయబిలిటీ ప్రొటక్షన్‌.. తనిఖీ రహిత, అత్యంత వేగవంతమైన రెన్యువల్‌ వంటి ఆఫర్లు మా వద్ద ఉన్నాయి. బీమా కలిగిన వాహనాలకు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా అత్యవసర సమయంలో టోయింగ్‌ సేవలను అందిస్తాం. బీమా సేవల కోసం మా పేమెంట్స్‌ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు’’ అని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వివరించింది. భారతీ ఆక్సా జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ సంజీవ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా అధిక శాతం వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. You may be interested

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా చాహెల్‌ నియమాకం

Saturday 20th April 2019

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ సైరీ చాహల్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చాహల్‌  ‘‘షీరోస్ డాట్ ఇన్‌’’ కంపెనీ ఫౌండర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంస్థ మధ్య వయస్సు మహిళలకు ఇంటి దగ్గరే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వినియోగదారుల సేవారంగంలో అపారమైన అనుభవం కలిగిన చాహల్‌ బోర్డు సభ్యురాలుగా నియామితులు కావడం తనకెంతో గర్వంగా

యూపీఎస్సీ ప్రిపరేషన్‌ చాలా ఈజీ!

Saturday 20th April 2019

- వీడియో పాఠాలు అందిస్తున్న లెర్నింగ్‌ స్పేస్‌ - 12 వేల మంది యూజర్లు; 25 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే - త్వరలోనే రూ.7 కోట్ల నిధుల సమీకరణ పూర్తి - ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ వెంకటేశ్వర రావు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 1990 యూపీఎస్సీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలో 72వ ర్యాంక్‌. మంచి హోదాలో ఇండియన్‌ రైల్వే సర్వీసెస్‌లో  (ఐఆర్‌ఎస్‌) ఉద్యోగం. ఇల్లు, పెళ్లి, పిల్లలు.. అంతా బాగానే ఉంది. కానీ, ఏదో

Most from this category