STOCKS

News


కార్డ్‌ లేకుండానే ఏటీఎమ్‌ల్లో క్యాష్‌ విత్‌డ్రా

Friday 7th September 2018
news_main1536296959.png-20051

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కార్డ్‌ లేకుండానే కొన్ని ఎంపిక చేసిన ఏటీఎమ్‌ల్లో నగదును పొందవచ్చు. ఇన్‌స్టంట్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ (ఐఎమ్‌టీ) టెక్నాలజీతో నడిచే ఏటీఎంలలో తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆరంభ ఆఫర్‌గా మొదటి రెండు విత్‌డ్రాయల్స్‌కు రూ.25 లావాదేవీ ఫీజును రద్దు చేస్తున్నామని తెలిపింది. ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే 20,000కు పైగా ఏటీఎమ్‌ల్లో ప్రస్తుతం తమ ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చని వివరించింది. ఈ ఏడాది చివరినాటికి ఐఎమ్‌టీ టెక్నాలజీతో పనిచేసే ఏటీఎమ్‌ల సంఖ్య లక్షకు పెరుగుతుందని పేర్కొంది. ఇలాంటి ఏటీఎమ్‌లను నిర్వహించే ఇమ్‌పేస్‌ పేమెంట్‌ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించింది. 



You may be interested

ఎన్‌సీఎల్‌టీకి జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ ఎనర్జీ ఎన్‌పీఏ కేసు!

Friday 7th September 2018

ముంబై: జీఎంఆర్‌ ఛత్తీస్‌గఢ్‌ సహా 11 విద్యుత్‌ ప్రాజెక్టుల ఎన్‌పీఏ ఖాతాలను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ప్రయాగ్‌రాజ్‌ పవర్‌ జనరేషన్‌, జై ప్రకాష్‌ పవర్‌ వెంచర్‌, ఎస్‌కేఎస్‌ ఇస్పాత్‌ పవర్‌, మీనాక్షి ఎనర్జీ, అథెనా ఛత్తీస్‌గఢ్‌ వపర్‌ జబువా, కేఎస్‌కే మహానంది, కోస్టల్‌ ఎనర్జెన్‌, జిందాల్‌ ఇండియా థర్మల్‌ పవర్‌ తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. రూ.2,000 కోట్లకు పైగా రుణాలు

ఎస్కార్ట్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ కాన్సెప్ట్‌ ట్రాక్టర్‌

Friday 7th September 2018

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, సాగు యంత్రాల తయారీ దిగ్గజ సంస్థ, ఎస్కార్ట్స్‌... ఆటోమేటెడ్‌  కాన్సెప్ట్‌ ట్రాక్టర్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌ వెహికల్‌ టెక్నాలజీస్‌తో రూపొందించిన ఈ ఆటోమేటెట్‌ ట్రాక్టర్‌ను 18- 20 నెలల్లో మార్కెట్లోకి తెస్తామని ఎస్కార్ట్స్‌ తెలిపింది. ఏడు దిగ్గజ సంస్థల సహకారంతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని ఎస్కార్ట్స్‌ సీఎమ్‌డీ నిఖిల్‌ నందా తెలిపారు. మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌ జియో, ట్రింబ్లే, సంవర్థన మదర్సన్‌ గ్రూప్‌, వాబ్‌కో, ఏవీఎల్‌, బాష్‌ కంపెనీల భాగస్వామ్యంతో

Most from this category