News


త్వరలో ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ఐపీఓ

Tuesday 27th November 2018
Markets_main1543297901.png-22403

- 8 మర్చంట్‌ బ్యాంకుల్ని నియమించిన కంపెనీ
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ఆఫ్రికా విభాగం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. ఈ ఐపీఓకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి ఎనిమిది అంతర్జాతీయ బ్యాంక్‌లను ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నియమించింది. జేపీ మోర్గాన్‌, సిటీ ​గ్రూప్‌, గోల్డ్‌మన్‌ శాచ్స్‌ ఇంటర్నేషనల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, అబ్సా గ్రూప్‌ లిమిటెడ్‌, బార్‌క్లేస్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ, బీఎన్‌పీ పారిబాస్‌, స్డాండర్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌లను ఈ కంపెనీ మర్చంట్‌ బ్యాంకర్లుగా  నియమించింది. ఆఫ్రికాలోని 14 దేశాల్లో ఆఫ్రికా ఎయిర్‌టెల్‌... 2జీ, 3జీ, 4జీ మొబైల్‌ సర్వీస్‌లను, ఎయిర్‌టెల్‌ మనీ పేరుతో మొబైల్‌ కామర్స్‌ సేవలను అందిస్తోంది.
ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాలో ఇటీవలే ఆరు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థలు 125 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. వార్‌బర్గ్‌ పింకస్‌, టెమసెక్‌, సింగ్‌టెల్‌, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.You may be interested

2శాతం పెరిగి.. 7% పడిన సన్‌ఫార్మా

Tuesday 27th November 2018

ముంబై: ఫార్మా రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ మంగళవారం ఉదయం ఏడు శాతం నష్టాలను నమోదుచేసింది. జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం లాభపడిన ఈ షేరు.. ఆ తరువాత ఒక్కసారిగా నష్టాలబాట పట్టింది. ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయానికి రూ.32 (6.17 శాతం) నష్టపోయి రూ.479 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో

సన్‌ఫార్మా చేతికి జపాన్‌ పోలా ఫార్మా

Tuesday 27th November 2018

డీల్‌ విలువ 10 లక్షల డాలర్లు  న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్‌ ఫార్మా... జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్‌ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్‌ చేస్తున్నామని సన్‌

Most from this category