STOCKS

News


ఎయిర్‌లైన్స్‌ న్యూ ఇయర్‌ ఆఫర్లు

Tuesday 25th December 2018
Markets_main1545721164.png-23217

జెట్‌ ఎయిర్‌వేస్‌ 30 శాతం డిస్కౌంట్‌
స్పైస్‌ జెట్‌ ప్రమోషనల్‌ ఆఫర్లు
హైదరాబాద్‌ నుంచి కొత్త సర్వీసులు
ఫుకెట్‌కు గో ఎయిర్‌ సర్వీస్‌; 50 శాతం తగ్గింపు

న్యూఢిల్లీ: క్రిస్‌మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా విమానయాన సంస్థలు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపు ఆఫర్లను ప్రకటించాయి. చమురు ధరల భారంతో నష్టాలతో నెట్టుకొస్తున్నప్పటికీ, పోటీ పరంగా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. నవంబర్‌ నెలలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 11.03 శాతం పెరిగింది. 116.45 లక్షల మంది ప్రయాణికులు ఈ నెల్లో విమానాల్లో ప్రయాణించారు. అయితే, ఈ వృద్ధి రేటు గత నాలుగేళ్ల కాలంలోనే అతి తక్కువ. అంతకుముందు అక్టోబర్‌ నెలలో ట్రాఫిక్‌ వృద్ధి 13.34 శాతంగా ఉంది.
జెట్‌ఎయిర్‌వేస్‌: పరిమిత కాలం పాటు అమల్లో ఉండే విధంగా దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో టికెట్‌ చార్జీలపై 30 శాతం తగ్గింపు ఇస్తోంది. జనవరి 1వ తేదీ అర్ధరాత్రి వరకు టికెట్‌ బుకింగ్‌లపై ఈ ఆఫర్లు అమల్లో ఉంటాయి. ఒకవైపు, రానుపోను ప్రయాణాలకూ, బిజినెస్‌, ఎకానమీ తరుగతుల టికెట్లపైనా తగ్గింపు ఇస్తోంది. అంతర్జాతీయ మార్గాల్లో జనవరి 7, ఆ తర్వాత ప్రయాణాలకు తగ్గింపు ధరలపై టికెట్లను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
గో ఎయిర్‌: గో ఎయిర్‌ సంస్థ థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో వచ్చే నెల 10-13వ తేదీల మధ్య జరిగే యాట్‌ షో నేపథ్యంలో, ఫుకెట్‌ ప్రయాణ టికెట్లపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది. భారత్‌ నుంచి ఫుకెట్‌కు నేరుగా విమాన సేవలను ప్రారంభిస్తున్న తొలి సంస్థ ఇదే.
స్పైస్‌జెట్‌: హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా, పుణె, కోయంబత్తూర్‌కు జనవరి 1 నుంచి కొత్తగా ఎనిమిది విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. బెంగళూరు, కోచి, పోర్ట్‌బ్లెయిర్‌, బాగ్‌డోగ్రా మధ్య ఎనిమిది సీజనల్‌ విమాన సర్వీసులను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 28 మధ్య నడపనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి వివిధ గమ్యస్థానాలకు మొత్తం మీద 41 విమానాలను నడపనుంది. హైదరాబాద్‌- కోల్‌కతా మార్గంలో రూ.2,699కే టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. అలాగే, కోల్‌కతా-హైదరాబాద్‌ మార్గంలో రూ.3,199కే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించింది. ఇక హైదరాబాద్‌-పుణె మధ్య రూ.2,499, రూ.2,209 ధరలను నిర్ణయించింది. హైదరాబాద్‌- కోయంబత్తూరుకు రూ.2,809, తిరుగు ప్రయాణ టికెట్‌ను రూ.2,309కే ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద అందిస్తున్నట్టు స్పైస్‌జెట్‌ పేర్కొంది.



You may be interested

డెడ్‌లైన్‌ డిసెంబర్‌ 31!

Tuesday 25th December 2018

 పాత మ్యాగ్‌స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులిక పనిచేయవు జనవరి 1 నుంచి చిప్‌ కార్డులే వారం రోజులే గడువు పాత డెబిట్‌ కార్డులను కొత్త కార్డులకు మార్చుకునేందుకు గడువు దగ్గరపడుతోంది. ప్రస్తుతం విరివిగా వినియోగంలో ఉన్న మ్యాగ్నెటిక్‌ స్ట్రిప్‌ (మ్యాగ్‌స్ట్రిప్‌) డెబిట్‌ కార్డులు.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 తర్వాత నుంచి చెల్లుబాటు కావు. జనవరి 1 నుంచి యూరో పే, మాస్టర్‌కార్డ్, వీసా (ఈఎంవీ) చిప్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. దీంతో

కార్పోరేషన్‌ బ్యాంకు ఎండీగా పీవీ భారతి

Tuesday 25th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా పి.వి.భారతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1, ఆ తర్వాత ఆమె నూతన బాధ్యతలు స్వీకరిస్తారని, 2020 మార్చి 31 వరకు కార్పొరేషన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో బాధ్యతల్లో ఉంటారని కేంద్రం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, కార్పొరేషన్‌ బ్యాంకు

Most from this category