STOCKS

News


రూ. 500 కోట్ల సమీకరణలో ఎయిరిండియా

Saturday 8th September 2018
news_main1536381486.png-20085

ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా దాదాపు రూ. 500 కోట్ల మేర నిధులను స్వల్పకాలిక రుణాల రూపంలో సమీకరించాలని యోచిస్తోంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనుంది. సెప్టెంబర్‌లోనే ఒకే దఫాలో లేదా విడతలవారీగా ఈ నిధులను సమీకరించే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ ఎయిరిండియా ఈ మేరకు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 10లోగా బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ మూలధన అవసరాల కోసం ఎయిరిండియా .. రుణాల వేటలో పడటం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. సంస్థ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విఫలం కావడంతో సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా చెల్లింపుల కోసం జూన్‌లో ఎయిరిండియా రూ. 1,000 కోట్లు సమీకరించింది. దాదాపు రూ. 50,000 కోట్ల పైగా రుణభారం ఉన్న ఎయిరిండియా.. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 



You may be interested

చిరిగిన నోట్ల మార్పిడీ విధానాల్లో మార్పు!

Saturday 8th September 2018

ముంబై: చిరిగిన నోట్ల మార్పిడీకి సంబంధించి విధి విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం సవరించింది. చిరిగిన లేక పాడైపోయిన 50 రూపాయలు ఆపైన డినామినేషన్స్‌ కరెన్సీ నోట్లకు పూర్తి విలువ పునఃచెల్లింపునకు సంబంధించి ‘‘పాడైపోయిన నోటు కనీసం ఎంత పరిమాణంలో ఉండాలి’’ అనే నిర్దేశాలను మార్చినట్లు  ఆర్‌బీఐ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది.  పెద్ద నోట్ల అనంతరం రూ.2,000 సహా అంతకన్నా తక్కువ

ప్రభుత్వ సంస్థల్లో షేర్ల బైబ్యాక్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్లు బైబ్యాక్ చేసేందుకు దాదాపు పదకొండు ప్రభుత్వ రంగ సంస్థలను (సీపీఎస్‌ఈ) కేంద్ర ఆర్థిక శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. కోల్ ఇండియా, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్‌ఎ౾ండీసీ, ఎన్ఎల్‌సీ, భెల్‌, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్‌, కేఐవోసీఎల్‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఈ జాబితాలో ఉన్నాయి. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇటీవలే ఆయా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ లిస్టును రూపొందించింది. అయితే, ఆయా

Most from this category