STOCKS

News


ఇక పీఎస్‌యూ వాటా విక్రయాల్లో జోరు

Monday 4th February 2019
news_main1549262383.png-23999

- వ్యూహాత్మక అమ్మకానికి 35 పీఎస్‌యూలు
- విక్రయ ప్రక్రియను సరళతం చేయాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం మరింత వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. పవన్‌ హాన్స్‌లో వాటా విక్రయం దీర్ఘకాలం పట్టడం, వ్యూహాత్మక వాటా విక్రయానికి 35 పీఎస్‌యూలు వరుసలో ఉండటంతో ఆర్థిక శాఖ ఈ దిశగా ఆలోచన చేస్తోంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం జరపాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపమ్‌) కసరత్తు చేస్తోంది.
ప్రక్రియ మరింత సరళతరం...
ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నామని దీపమ్‌ కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. ఈ ప్రక్రియకు దీర్ఘకాలం పడుతుందని, ఆరంభంలో అది అంగీకారయోగ్యమేనని, కానీ ఇప్పుడు కాదని పేర్కొన్నారు. వ్యూహాత్మక వాటా విక్రయం జరపదగ్గ ప్రభుత్వ రంగ సంస్థల ఐదో జాబితాను నీతి ఆయోగ్‌ ఇటీవలనే దీపమ్‌కు సమర్పించిందని తెలిపారు.  ఈ తాజా జాబితాతో కలుపుకొని వ్యూహాత్మక వాటా విక్రయం జరపాల్సిన ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య మొత్తం 35కు పెరిగిందని పేర్కొన్నారు. దీనికి కేబినెట్‌ ఆమోదం పొందాల్సి ఉందన్నారు. ఈ జాబితాలో ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, బీఈఎమ్‌ఎల్‌, స్కూటర్స్‌ ఇండియా, భారత్‌ పంప్స్‌ కంప్రెసర్స్‌, సెయిల్‌కు చెందిన భద్రావతి, సలేమ్‌, దుర్గాపూర్‌ యూనిట్లు, హిందుస్తాన్‌ ఫ్లోరోకార్బన్‌, హిందుస్తాన్‌ న్యూస్‌ప్రింట్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఐటీడీసీలు ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలను ఆధారంగా ఈ కంపెనీలో వ్యూహాత్మక విక్రయ ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తామని వివరించారు.



You may be interested

షీలాఫోమ్‌ అమ్మకాల్లో 11 శాతం వృద్ధి

Monday 4th February 2019

హైదరాబాద్‌: స్లీప్‌వెల్‌ బ్రాండ్‌ పేరిట పరుపులను(మ్యాట్రెస్‌) విక్రయించే షీలాఫోమ్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో అమ్మకాల పరంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో పరిశ్రమ వృద్ధి 6 శాతంగా ఉంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లో ప్రతికూలతల నడుమ పరిశ్రమకు మించిన వృద్ధిని కంపెనీ సాధించింది. అవ్యవస్థీకృత రంగం నుంచి కొనుగోళ్లు క్రమంగా వ్యవస్థీకృత రంగం వైపు మళ్లుతాయని అంచనా వేస్తోంది. డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 6,800

ఎన్‌సీఎల్‌టీకీ అదే రుణ పరిష్కార ప్రణాళిక

Monday 4th February 2019

ఆర్‌కామ్ వెల్లడి న్యూఢిల్లీ: రుణాల పరిష్కారానికి సంబంధించి గతంలో రూపొందించిన ప్రణాళిక తరహా ప్రతిపాదనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముందు కూడా ఉంచనున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) వెల్లడించింది. అసెట్స్ విక్రయం కోసం రుణదాతలందరి దగ్గర్నుంచి నూటికి నూరు శాతం అనుమతులు తీసుకోవాలన్న నిబంధన అమలు సాధ్యం కాకపోవడంతో దివాలా పిటిషన్‌ ద్వారా ఎన్‌సీఎల్‌టీ మార్గంలోనైనా రుణ పరిష్కార ప్రక్రియకు ఆమోదం తీసుకోవాలని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు

Most from this category