STOCKS

News


ఆస్తుల అమ్మకంపై ఎయిర్‌ ఇండియా దృష్టి

Friday 16th November 2018
news_main1542347967.png-22082

ముంబై: నష్టాల్లో ఉ‍న్న ఎయిర్‌ ఇండియా దేశవ్యాప్తంగా తనకున్న 70 నివాస, వాణిజ్య ఆస్తులను విక్రయించే ప్రణాళికతో ఉంది. దీని ద్వారా రూ.700- 800 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 16 పట్టణాల పరిధిలో ఇవి ఉన్నాయి. ప్రభుత్వరంగంలోని ఎంఎస్‌టీసీ ద్వారా ఈ- వేలాన్ని నిర్వహించనుంది. తన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచన గతంలో యూపీఏ ప్రభుత్వం 2012లో అనుమతించిన ప్రణాళికకు లోబడే ఉండడం గమనార్హం. ఇందులో భాగంగా 2014 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య రూ.5,000 కోట్ల నిధులను ఎయిర్‌ ఇండియా సమీకరించాల్సి ఉంది. ‘‘70 ఆస్తులను ఈ-వేలం వేయడం ద్వారా రూ.700-800 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నాం. వీటిల్లో నివాస, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని గతంలోనూ వేలానికి ఉంచగా కొనుగోలుదారులు రాలేదు’’ అని ఓ అధికారి తెలిపారు. గత నెలలో ఎయిర్‌ ఇండియా చెన్నై, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు, అమృత్‌సర్‌లో 14 ఆస్తులను అమ్మకానికి ఉంచిన విషయం గమనార్హం. ఈ సంస్థకు దాదాపు రూ.55,000 కోట్ల రుణభారం ఉంది. ఇక, ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం ఎయిర్‌ ఇండియాకు కాసులు కురిపిస్తోంది. 2013- 2018 మధ్య అద్దెల రూపంలోనే సంస్థకు రూ.291 కోట్లు సమకూరాయి.



You may be interested

బీఎండబ్ల్యూ ఎం2 కాంపిటీషన్‌ విడుదల

Friday 16th November 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎం2 కాంపిటిషన్‌’ పేరుతో కొత్త వెర్షన్‌ కారును గురువారం విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.79.9 లక్షలు. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మూడు లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు కేవలం 4.2 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 250 కిలోమీటర్లు అని పేర్కొంది.  ఆన్‌లైన్‌

బెంగళూరులో ఎలక్ట్రిక్ టెక్నాలజీ హబ్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ గురువారం బెంగళూరులో తమ తొలి ఎలక్ట్రిక్ టెక్నాలజీ తయారీ హబ్‌ను ఏర్పాటు చేసింది. సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ హబ్‌లో ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌లో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్స్‌, పవర్ ఎలక్ట్రానిక్స్‌, మోటార్ అసెంబ్లీ మొదలైన వాటిని తయారు చేస్తారు. దీంతో తమ ఉత్పత్తి సామర్ధ్యం వార్షికంగా 25,000 ఎలక్ట్రిక్ వాహనాలకు చేరుతుందని మహీంద్రా

Most from this category