STOCKS

News


ఎయిరిండియా ప్రైవేటీకరణ ఒప్పుకోం

Tuesday 9th July 2019
news_main1562651348.png-26915

  • చైర్మన్‌తో భేటీలో ఉద్యోగ సంఘాల స్పష్టీకరణ

ముంబై: నష్టాలు, రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మరోసారి ప్రయత్నాలు ప్రారంభించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రైవేటీకరణతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు నెలకొన్న దరిమిలా యాజమాన్యానికి తమ ఆందోళన గురించి తెలియజేశాయి. ప్రైవేటీకరణ ప్రణాళికపై సోమవారం చైర్మన్‌ అశ్వనీ లోహానీతో జరిగిన సమావేశంలో 13 ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. దాదాపు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో .. కంపెనీని మళ్లీ గట్టెక్కించేందుకు తాము అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, శాయశక్తులా కృషి చేస్తామని ఉ‍ద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాయి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను వ్యతిరేకించాలని 13 యూనియన్ల ఫోరం నిర్ణయించుకున్నట్లు సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల వర్గాలు తెలిపాయి. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం కంపెనీకి నామమాత్రంగా రూ. 1 లక్ష మాత్రమే కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్‌ లోగా విక్రయ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా విధించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజా డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికపై ఉద్యోగ సంఘాలతో చైర్మన్ భేటీ అయ్యారు. ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్‌, ఎయిరిండియా ఎంప్లాయీస్ యూనియన్‌, ఇండియన్ ఎయిర్‌లైన్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ మొదలైన ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.



You may be interested

ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం

Tuesday 9th July 2019

ఈ ఏడాది ఫార్మా వృద్ధి 11-13 శాతం దేశీయంగా 9-10 శాతం గ్రోత్‌ ఇక్రా నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమ 11-13 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని ఇక్రా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో ఆర్యోగకర డిమాండ్‌ ఇందుకు కారణమని వివరించింది. అలాగే యూఎస్‌ మార్కెట్లో ధరల ఒత్తిడి తగ్గడం, నూతన ఉత్పత్తుల విడుదల, ఇప్పటికే విక్రయిస్తున్న మందుల విషయంలో కంపెనీల వాటా పెరగడం వంటి

దిగుమతులు తగ్గించడానికే పసిడిపై సుంకం పెంపు

Tuesday 9th July 2019

రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే న్యూఢిల్లీ: దేశంలోకి అవసరేతర దిగుమతులు తగ్గించాలన్న విధానంలో భాగంగానే 2019-20 బడ్జెట్‌లో పసిడిపై సుంకాన్ని 10  శాతం నుంచి 12.5 శాతానికి పెంచినట్లు రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే పేర్కొన్నారు. సుంకాల పెంపు వల్ల ఇప్పటికే తీవ్రంగా ఉన్న పసిడి అక్రమ దిగుమతులు, రవాణా మరింత తీవ్రమవుతాయని వ్యక్తమవుతున్న ఆందోళనలను రెవెన్యూ కార్యదర్శి ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఇలాంటి చర్యల నిరోధానికి తగిన అన్ని

Most from this category