STOCKS

News


జెట్‌ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి

Tuesday 23rd April 2019
news_main1555996658.png-25288

- ఐబీఏకి బ్యాంకు యూనియన్ల విజ్ఞప్తి

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 22,000 మంది పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీతాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కష్టకాలంలో కొంత తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను (ఐబీఏ) బ్యాంకు యూనియన్లు కోరాయి. జెట్ సిబ్బందికి స్పెషల్ లోన్ స్కీముల్లాంటివి రూపొందించేలా బ్యాంకులకు సూచించాలని అభ్యర్థించాయి. అలాగే, ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించడంలో జెట్‌కు తోడ్పడేలా తగు విలువ గల ఆస్తులను తనఖాగా ఉంచుకుని కంపెనీకి కూడా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఉద్యోగులకు ఒక్క నెల జీతాలైనా చెల్లించాలంటే కనీసం రూ.170 కోట్లు అవసరమవుతాయంటూ జెట్ ఎయిర్‌వేస్ సీఈవో వినయ్ దూబే వెల్లడించిన నేపథ్యంలో బ్యాంకు యూనియన్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడేలా కంపెనీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలంటూ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బ్యాంకు యూనియన్లు లేఖ రాశాయి. బ్యాంకులకు రూ. 8,500 కోట్లు, విమానాలు లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్ రూ. 4,000 కోట్ల బాకీపడింది. ఫ్లయిట్స్‌ రద్దుతో ప్రయాణికులకు వేల కోట్ల రూపాయలు రీఫండ్ చేయాల్సి ఉంది.



You may be interested

బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్‌

Tuesday 23rd April 2019

- డీల్ విలువ రూ.3,211 కోట్లు - ముందు ప్రమోటర్ల నుంచి 51% వాటా కొనుగోలు - తర్వాత 26 శాతానికి ఓపెన్ ఆఫర్‌ ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్

సెప్టెంబర్‌ కల్లా రెండు రైల్వే ఐపీఓలు!

Tuesday 23rd April 2019

 ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓలపై కసరత్తు రూ.1,500 కోట్ల సమీకరించనున్న కేంద్రం  న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీల ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలియజేశారు. ఎన్నికలు పూర్తయి, కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పిస్తామన్నారు. ఇండియన్‌​ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)

Most from this category