STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌లో 30,000 నియామకాలు

Tuesday 9th October 2018
news_main1539059079.png-20951

 పండుగల అమ్మకాల కోసం 30,000 మంది సీజనల్‌ ఉద్యోగులను నియమించుకున్నట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 10-14 సమయంలో జరుగనున్న ఐదవ ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌ ద్వారా పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగ కల్పనలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు పోటీసంస్థ అమేజాన్‌ పండుగల అమ్మకాల నిమిత్తం 50,000 మంది సీజనల్‌ ఉద్యోగులను తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.



You may be interested

టాప్‌ గేర్‌లో మారుతీ డిజైర్‌

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఏడాదిన్నర కిందట విడుదల చేసిన డిజైర్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అమ్మకాల్లో మరో మైలురాయిని అధిగమించింది. సరిగ్గా 17 నెలల కిందట మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సబ్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ కారు అమ్మకాలు 3 లక్షలు మించినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది మే నెలలో మూడవ జనరేషన్‌ డిజైర్‌గా మార్కెట్‌లో విడుదలైన ఈ కారు.. అంతకుముందు వెర్షన్‌ కంటే 28 శాతం అధిక

పేలవంగా అవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిస్టింగ్‌

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో సోమవారం పేలవంగా లిస్టయ్యాయి. ఈ షేర్‌ బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.821తో పోలిస్తే 8 శాతం నష్టంతో రూ.758 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 14 శాతం నష్టంతో రూ.710కు పడిపోయింది. చివరకు 6 శాతం నష్టంతో రూ.773 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 4.96 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 35 లక్షల ఈక్విటీ షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం

Most from this category