STOCKS

News


పోటీతో టెల్కోల ఆదాయం అస్థిరం

Friday 23rd November 2018
news_main1542948547.png-22331

ముంబై: తీవ్రమైన పోటీ కారణంగా టెలికం మార్కెట్‌ అస్థిరంగా మారిందని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన డిజిటల్‌ ఇండియాకు ఇది హానికరమని దేశంలో అత్యధిక కస్టమర్లున్న వొడాఫోన్‌ ఐడియా సంస్థ సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. వొడాఫోన్‌, ఐడియాల విలీనం తర్వాత తొలిసారిగా బాలేష్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలను పరోక్షంగా ప్రస్తావిస్తూ... ‘‘ముగ్గురు ఆపరేటర్లూ నష్టాలనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతారని ఆశించలేం. ఓ వినియోగదారుని నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) భారీగా తగ్గింది. జియోకు ఇది రూ.131గా ఉంటే, ఎయిర్‌టెల్‌కు రూ.100గా ఉంది’’ అని చెప్పారు. టెలికామ్‌ కంపెనీలు క్యాష్‌ ఫ్లో సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. అదే పొరుగు దేశం చైనాలో అధిక ఏఆర్‌పీయూ కారణంగా అక్కడి ఆపరేటర్లు భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు సౌకర్యంగా ఉన్నట్టు శర్మ చెప్పారు. దేశీయ మార్కెట్లో ధరల పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. వొడాఫోన్‌, ఐడియా విలీనం కారణంగా 2021 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.14,000 కోట్లు ఆదా అవుతాయన్నారు. టవర్లను మరింత మెరుగ్గా వినియోగించుకోవడం ద్వారా ప్రయోజనం పొందే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్పెక్ట్రం ఫీజులు, వడ్డీ రూపేణా వచ్చే మార్చి నాటికి రూ.3,000 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.12,000 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.



You may be interested

ఎగవేతదారుల లుకవుట్‌ సర్క్యులర్లు 

Friday 23rd November 2018

ఇక బ్యాంకు సీఈఓలే జారీ చేస్తారు!! న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు, మోసగాళ్లు దేశం విడిచి పారిపోకుండా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సీఈవోలకు లుకవుట్‌ సర్క్యులర్లు జారీ చేయాలని కోరే అధికారాన్ని కేంద్రం కల్పించింది. పారిశ్రామికవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలు పెద్ద ఎత్తున రుణ ఎగవేతలు, మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లుకవుట్‌ సర్క్యులర్‌ను జారీ చేయాలంటూ కేంద్ర హోం శాఖను కోరే

వచ్చే ఏడాదిలోపు మార్కెట్‌లో రెట్టింపు రాబడి..!

Friday 23rd November 2018

ముంబై: విదేశీ నిధులు తరలివెళ్తునప్పటికీ.. దేశీ నిధులు మార్కెట్‌ను ఆదుకుంటున్నాయని, ప్రత్యేకించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ల ద్వారా మార్కెట్‌లోనికి ప్రవేశించే నిధులు గతరెండేళ్లుగా జోరుమీద కొనసాగున్నాయన్నారు టౌరస్‌ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ విభాగం మేనేజర్‌ ప్రసన్న ప్రతీక్‌. ఈ ట్రెండ్‌ మరి కొంతకాలం కొనసాగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్వెస్టర్లకు సిప్‌లపై నమ్మకం పెరగడం, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో నిబంధనలు సంతృప్తికరంగా ఉండడం, సామాన్యులలో సిప్‌లపై

Most from this category