STOCKS

News


రాయల్‌ సుందరంలో ఏజీస్‌కు వాటా!

Thursday 15th November 2018
news_main1542259309.png-22037

చెన్నై: సుందరం ఫైనాన్స్‌ సంస్థ, సాధారణ బీమా కంపెనీ రాయల్‌ సుందరంలో తనకున్న 75.90 శాతం వాటా నుంచి 25.90 శాతం వాటాను ఏజీస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,520 కోట్లు. విక్రయం తర్వాత కూడా రాయల్‌ సుందరంలో సుందరం ఫైనాన్స్‌కు 50 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్‌ ఐఆర్‌డీఏ తదితర సంస్థల అనుమతులపై ఆధారపడి ఉంటుందని, 2019 మొదటి మూడు నెలల కాలంలో డీల్‌ పూర్తి కావచ్చని సుందరం ఫైనాన్స్‌ ప్రకటించింది. రాయల్‌ సుందరం ప్రధానంగా మోటార్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో బలంగా ఉంది. ఈ సంస్థకు 5,600 మంది ఏజెంట్లతో పాటు, 700 శాఖలున్నాయి. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం రూపంలో రూ.2,643 కోట్లు ఆదాయాన్ని, పన్ను అనంతరం రూ.83 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రీమియం ఆదాయంలో 19 శాతం, నికర లాభంలో 56 శాతం చొప్పున వృద్ధి నమోదయ్యాయి. తదుపరి దశ వృద్ధి కోసం ఏజీస్‌తో జత కట్టామని సుందరం ఫైనాన్స్‌ ఎండీ టీటీ శ్రీనివాసరాఘవన్‌ తెలిపారు. ఏజీస్‌కు ఉన్న అంతర్జాతీయ అనుభవం తమకు విలువైన ఆస్తిగా అభివర్ణించారు. ఆసియాలో స్థానిక భాగస్వామ్యాలు, జాయింట్‌ వెంచర్ల ద్వారా ఏజీస్‌ అనుసరించే భిన్నమైన విధానం రాయల్‌ సుందరంకు గణనీయమైన విలువను తెచ్చిపెడుతుందని రాఘవన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రానున్న సంవత్సరాల్లో గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భారత బీమా రంగ మార్కెట్‌ తమకు గొప్ప అవకాశాలు కల్పిస్తోందని ఏజీస్‌ సీఈవో బార్ట్‌దే స్మెట్‌ పేర్కొన్నారు. 



You may be interested

పసిడి రూ. 300 జంప్‌

Thursday 15th November 2018

గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేయడంతో ఇక్కడ ఎంసీఎక్స్‌లో సైతం బుధవారం రాత్రి అంతేశాతం పెరిగింది. గత రాత్రి పెరుగుదలకు కొనసాగింపుగా గురువారం ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:15లకు ఔన్స్‌ పసిడి ధర 1.10డాలర్లు స్వల్పంగా పెరిగి 1211.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి 12డాలర్ల(1శాతం)లాభపడింది. ఈ డిసెంబర్‌లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపపై స్పష్టత రావడంతో

పీసీ జ్యుయలర్‌ లాభాలు 38 శాతం డౌన్‌

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: పీసీ జ్యూయలర్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.94 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.151 కోట్లు)తో పోల్చితే 38 శాతం క్షీణించిందని పీసీ జ్యుయలర్‌ తెలిపింది. అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండటంతో నికర లాభం తగ్గిందని పేర్కొంది. గత క్యూ2లో రూ.2,622 కోట్లుగా ఉన్న నికర ఆదాయం ఈ క్యూ2లో రూ.1,635 కోట్లకు

Most from this category