STOCKS

News


ఆదిత్యా బిర్లా సన్‌లైప్‌...మంత్లీ ఇన్‌కమ్‌ప్లాన్‌

Friday 25th January 2019
Markets_main1548398075.png-23801

ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ ప్లాన్‌ పేరిట వినూత్నమైన బీమా పథకాన్ని ఆవిష్కరించింది. కాల వ్యవధి తీరేంత వరకు ఈ ప్లాన్‌ నెలవారీ ఆదాయాన్నిస్తుందని సంస్థ తెలియజేసింది. పాలసీ ప్రీమియం చెల్లింపు ముగిసిన తర్వాత నుంచి పాలసీ కాల వ్యవధి ముగిసేంత వరకు ఏటా సమ్‌ అష్యూర్డ్‌లో ఒక శాతాన్ని నెలవారీ చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఇన్వెస్టర్లు తమకు ఇష్టమైతే నెలవారీ ఒక శాతం ఆదాయాన్ని ఎంపిక చేసుకోకుండా ఉండే ఆప్షన్‌ కూడా ఉంది. ఇక నెలనెలా ఒక శాతం బెనిఫిట్‌తో పాటు, ఏటా ఈ మొత్తం 5 శాతం పెంచి ఇచ్చే మరో ఆప్షన్‌ కూడా ఉంది. నెలవారీగానే కాకుండా ఏడాదికోసారి ఆదాయాన్ని ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలోపు మరణం సంభవిస్తే బీమా మొత్తాన్ని చెల్లించడంతోపాటు కుటుంబీకులకు ప్రతి నెలా ఆదాయం చెల్లించడం మొదలవుతుందని కంపెనీ తెలిపింది. పాలసీ కాల వ్యవధి తీరే వరకు నెలవారీ ఆదాయ చెల్లింపు ఉంటుంది. ప్రమాదంలో మరణిస్తే సమ్‌ అష్యూర్డ్‌కు రెట్టింపు చెల్లించే ఇన్‌బిల్ట్‌ రైడర్‌ కూడా ఇందులో ఉంది.



You may be interested

లిస్టైన తొలిరోజే...స్పెన్సర్‌ రిటైల్‌ లోయర్‌ సర్య్కూట్‌

Friday 25th January 2019

స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌ షేర్లు ఎ‍క్చే‍్సంజీల్లో లిస్టైన మొదటి రోజే లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యాయి. సంజీవ్‌ గోయంకా గ్రూపు కంపెనీ సీఈఎస్‌సీ నుంచి విభజించబడిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు నేడు ఎక్చే‍్సంజ్‌లో లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇరు షేర్ల కౌంటర్లో కొనుగోళ్లు కరువవడంతో లిస్టైన కాసేపటికే రెండు షేర్లు 5శాతం క్షీణించి ఇరు ఎక్చే‍్సంజీల్లో లోయర్‌ సర్క్యూట్‌ వద్ద లాక్‌ అయ్యాయి.స్పెన్సర్స్‌ రిటైల్‌ కింద అన్ని

ఇండియా వైపు మార్క్‌మొబియస్‌ మొగ్గు

Friday 25th January 2019

ప్రపంచపేరొందిన ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ ఈ ఏడాది పెట్టుబడులకు భారత్‌ బాగుందని సూచిస్తున్నారు. వర్ధమాన మార్కెట్లలో భారత్‌, బ్రెజిల్‌, టర్కీలపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. ఈ మార్కెట్లలో ఎంటరయ్యేందుకు ఇదే మంచి తరుణమన్నారు. ఇటీవలే ఇండియాలో పర్యటించానని, అక్కడ వచ్చిన మార్పులు చాలా ఆశ్చర్యాన్నిచ్చాయని తెలిపారు. చాలా వరకు వర్ధమాన మార్కెట్లలో భారీ రికవరీ కనిపిస్తోందని చెప్పారు. గతేడాది ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ రేట్ల భయాలతో ఈ మార్కెట్లు నేల చూపులు

Most from this category