STOCKS

News


ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవల నిలిపివేత

Saturday 20th July 2019
news_main1563612988.png-27204

ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంక్‌ తన సేవలు నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వినియోగదారులు తన ఖాతాల్లో ఏమైనా నగదు నిల్వలున్నట్లైతే, జూలై 26వ తేదిలోగా విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కోరింది. నగదు విత్‌డ్రా, బదిలీలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంక్‌, లేదా దగ్గరలోని బ్యాంక్‌ పాయింట్లలో సౌకర్యం కల్పించినట్లు తెలిపింది. ఈ అంశంపై వినియోగదారుల ఏదైనా సమస్యలు, సందేహాల నివృ‍త్తి కొరకు 18002092265 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. వ్యాపార ప్రక్రియలో భాగంగా ఈ అనూహ్య నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. పేమెంట్స్‌ బ్యాంక్‌ సేవలను అందించేందుకు ఆదిత్య బిర్లా నువా, ఐడియా సెల్యూలార్‌ సంస్థలు 51:49 నిష్పత్తిలో ఏడాది క్రితం జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించాయి. 



You may be interested

మార్కెట్లు ఇంకా నష్టపోవొచ్చు: కునాల్ బోత్రా

Saturday 20th July 2019

మార్కెట్లో జోరుగా సంస్థాగత విక్రయాలు జరుగుతున్నట్లు అమ్మకాల సరళిని చూస్తే అర్థమవుతోందని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మార్కెట్ విశ్లేషకుడు కునాల్ బోత్రా చెప్పారు. ఇంటర్యూలోని ముఖ్యమైన విషయాలు ఆయన మాటల్లోనే.... అంతర్జాతీయ భాగస్వామ్యం మన మార్కెట్లకు ముఖ్యమని గత కొన్ని సెషన్‌లను గమనిస్తే అర్దమవుతుంది. విదేశి ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపితే దేశియ ఇన్వెస్టర్లు కూడా వారితో జత కట్టారు. ఇలా అయితే మార్కెట్లలో సమతూకం ఎలా వస్తుంది? దీంతోపాటు మార్కెట్లను

స్వల్ప నష్టంతో ముగిసిన పసిడి

Saturday 20th July 2019

పసిడి ఫ్యూచర్లలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఔన్స్‌ పసిడి ధర గురువారం ముగింపు (1,429)తో పోలిస్తే 1.50డాలర్ల స్వల్ప నష్టంతో 1,428.85 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలు మరింత బలపడటంతో పాటు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తెరపైకి రావడంతో ఆసియా ట్రేడింగ్‌లో 26 డాలర్ల మేర లాభపడి 1,454.35 వద్ద ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పసిడి

Most from this category