STOCKS

News


అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ చేతికి కేఈసీ బికనీర్‌

Saturday 9th February 2019
news_main1549697818.png-24105

ముంబై: కేఈసీ ఇంటర్నేషనల్‌లో భాగమైన విద్యుత్ పంపిణీ సంస్థ కేఈసీ బికనీర్ సికర్ ట్రాన్స్‌మిషన్‌ను (కేబీఎస్‌టీ) కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆదానీ ట్రాన్స్‌మిషన్ (ఏటీఎల్‌) వెల్లడించింది. 100 శాతం వాటాల కొనుగోలుకు రూ. 227.50 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. గతేడాది నవంబర్‌లో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏటీఎల్‌ పేర్కొంది. కేబీఎస్‌టీకి 344 సర్క్యూట్ కి.మీ. మేర లైన్లు ఉన్నాయని, ఈ కొనుగోలుతో తమ నెట్‌వర్క్ మొత్తం 13,450 సర్క్యూట్ కి.మీ.కు చేరుతుందని ఏటీఎల్ వివరించింది.



You may be interested

నోకియా 5.1 ప్లస్‌ మరిన్ని వేరియంట్లలో

Saturday 9th February 2019

హైదరాబాద్‌: హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా 5.1 ప్లస్‌ మోడల్‌లో అధిక ర్యామ్‌, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్‌, 32 జీబీ రామ్‌ మోడల్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది. ‘‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్‌ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన

ఇండియాబుల్స్‌ ‘ఓక్‌నార్త్‌’లో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు

Saturday 9th February 2019

న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన అసోసియేట్‌ కంపెనీ ఓక్‌నార్త్‌లో సాఫ్ట్‌బ్యాంకు రూ.2,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఓక్‌నార్త్‌ బ్రిటన్‌లో వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాంచ్‌లు లేకుండా పూర్తి డిజిటల్‌ బ్యాంకుగా ఇది నడుస్తుండడం గమనార్హం. సాఫ్ట్‌బ్యాంకు తాజా పెట్టుబడితో ఓక్‌నార్త్‌ ఈక్విటీ క్యాపిటల్‌ రూ.7,000 కోట్లు అవుతుందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఓక్‌నార్త్‌ యూరోప్‌లో వేగంగా ఎదుగుతున్న కొత్త బ్యాంకుగా

Most from this category