STOCKS

News


అదానీ చేతికి రిలయన్స్‌ ఎనర్జీ

Thursday 30th August 2018
news_main1535606559.png-19789

ముంబై: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ముంబైలోని విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని విక్రయించటం పూర్తయింది. ముంబై నగర విద్యుత్‌ సరఫరా వ్యాపారాన్ని (రిలయన్స్‌ ఎనర్జీ కపెనీని) రూ.18,800 కోట్లకు అదానీ ట్రాన్సిమిషన్‌కు విక్రయించడం పూర్తయిందని కంపెనీ చైర్మన్‌ అనిల్‌ అంబానీ తెలియజేశారు. ఈ విక్రయంతో మూడింట రెండొంతుల రుణ భారం తగ్గిందన్నారు. ఇంతకు ముందు రూ.22,000 కోట్లుగా ఉన్న కంపెనీ రుణ భారం ఇప్పుడు రూ.7,500 కోట్లకు తగ్గిందని తెలియజేశారు. వచ్చే ఏడాది కల్లా ఎలాంటి రుణభారం లేని కంపెనీగా అవతరించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. 
రూ.133 కోట్ల ఎన్‌సీడీలకు చెల్లింపులు...
ముంబై ఇంధన వ్యాపార విక్రయానికి సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల ఆమోదం పొందామని అంబానీ తెలియజేశారు. ఈ డీల్‌కు ఆమోదం తెలపడానికి బుధవారం డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం నిర్వహించామన్నారు. ఈ కంపెనీ రూ.133 కోట్ల ఎన్‌సీడీల చెల్లింపుల్లో గత వారం విఫలమైంది. అయితే ముంబై ఇంధన వ్యాపార విక్రయం వల్ల వచ్చిన డబ్బులతో మరికొన్ని రోజుల్లో ఈ చెల్లింపులు జరుపుతామని అనిల్‌ అంబానీ తెలిపారు. బాంద్రా వెర్సోవా సీలింక్‌ ప్రాజెక్ట్‌ పనులు అక్టోబర్‌ 1 నుంచి ఆ‍రంభమవుతాయని పేర్కొన్నారు. 10 కిమీ ఈ ప్రాజెక్ట్‌ను ఇటలీకి చెందిన ఆస్టాల్డి కంపెనీ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని, ఈ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.6,994 కోట్లని తెలిపారు. రిలయన్స్‌ ఎనర్జీ భారత ప్రైవేట్‌ రంగంలో అతి పెద్ద విద్యుత్‌ పంపిణీ సంస్థ. ముంబై పట్టణంలో 30 లక్షల గృహాలు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సేవలందిస్తోంది. గరిష్ట డిమాండ​ 1,800 మెగావాటు కాగా, వార్షిక ఆదాయం రూ.7,500 కోట్ల మేర ఉంటుంది. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 3.7 శాతం లాభంతో రూ.439 వద్ద ముగిసింది.

రిలయన్స్‌ ఎనర్జీ కొనుగోలుతో అదానీ గ్రూప్‌ తొలిసారిగా విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకూ ఈ కంపెనీ విద్యుదుత్పత్తి, ప్రసార రంగాల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ డీల్‌ పూర్తయిన తర్వాత రిలయన్స్‌ ఎనర్జీ పేరును అదానీ ఎలక్ట్రిసిటీ ముంబైగా మారుస్తారు. ఇది అదానీ ‍ట్రాన్స్‌మిషన్‌ అనుబంధ కంపెనీగా కొనసాగుతుంది.
ఇప్పట్లో ఇతర ఆస్తుల విక్రయ యోచనేదీ లేదని అనిల్‌ అంబానీ ఈ సందర్భంగా చెప్పారు. అయితే క్విప్‌, రైట్స్‌ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించే ఆలోచనలున్నాయని పేర్కొన్నారు. You may be interested

యూనిటెక్‌ నష్టాలు రూ.73 కోట్లు

Thursday 30th August 2018

 న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన రియల్టీ కంపెనీ యూనిటెక్ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.16 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.73  కోట్లకు ఎగిశాయని యూనిటెక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా భారీగా తగ్గింది. గత క్యూ1లో రూ.289 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.78 కోట్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం

విదేశీ రూట్లలో విస్తార సర్వీసులు

Thursday 30th August 2018

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్‌ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్‌ (థాయ్‌ల్యాండ్‌) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి. అన్నింటికన్నా ముందుగా దుబాయ్‌కు సర్వీసులు ప్రారంభించాలనుకున్నప్పటికీ .. ఇప్పటికే రెండు దేశాల ద్వైపాక్షిక కోటా

Most from this category