STOCKS

News


అదానీ పవర్‌కు పీఎల్‌ఎఫ్‌ షాక్‌

Tuesday 7th August 2018
news_main1533618774.png-18997

న్యూఢిల్లీ: అదానీ పవర్‌ కంపెనీ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.453 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 82 శాతం పెరిగి రూ.825 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం కూడా తగ్గిందని అదానీ పవర్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.5,601 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,959 కోట్లకు చేరిందని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ తెలిపారు. విద్యుత్‌ ప్లాంట్ల ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్లు(పీఎల్‌ఎఫ్‌)లు తక్కువగా ఉండటం వల్ల ఆదాయం తగ్గిందని వివరించారు. 

గత క్యూ1లో 63 శాతంగా ఉన్న పీఎల్‌ఎఫ్‌ ఈ క్యూ1లో 38 శాతానికి తగ్గిందని తెలిపారు. దేశీయంగా బొగ్గు లభ్యత తక్కువ స్థాయిలో ఉండటం, దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు అధికంగా ఉండటం వల్ల వాణిజ్యపరంగా ప్లాంట్లను కొన్ని రోజులు మూసివేయడం వల్ల పీఎల్‌ఎఫ్‌ తగ్గిందని పేర్కొన్నారు. దేశీయంగా బొగ్గు లభ్యత పెరగడంతో పీఎల్‌ఎఫ్‌లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని కంపెనీ సీఈఓ వినీత్‌ ఎస్‌. జైన్‌ వ్యక్తం చేశారు. కొనసాగుతున్న ఆర్థిక వృద్ధి కారణంగా విద్యుత్తుకు డిమాండ్‌ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అదానీ పవర్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.33 వద్ద ముగిసింఇ.



You may be interested

మరింత పెరిగిన సిండికేట్‌ బ్యాంకు నష్టాలు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని సిండికేట్‌ బ్యాంకు నష్టాలు జూన్‌ త్రైమాసికంలో మరింత విస్తృతం అయ్యాయి. రూ.1,282 కోట్ల నష్టాన్ని బ్యాంకు ఈ కాలంలో చవిచూసింది. గతేడాది ఇదే కాలంలో నష్టం రూ.263 కోట్లుగా ఉంది. ఆదాయం సైతం రూ.5,637 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.6,171 కోట్లు. వడ్డీ ఆదాయం రూ.5,484 కోట్ల నుంచి రూ.5,257 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, ఆర్‌బీఐ వద్ద, ఇతర ఇంటర్‌ బ్యాంకు వేదికల

ఎయిర్‌ ఇండియా ఉద్యోగులకు జీతాల్లేవ్‌

Tuesday 7th August 2018

ముంబై: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో మరోసారి ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యం చేసిన ఎయిర్‌ ఇండియా.. జూలై జీతాల చెల్లింపు ఇంకా చేయకపోగా, ఎప్పుడుచెల్లించేది స్పష్టత ఇవ్వలేదని వెల్లడయింది. వరుసగా మార్చి నుంచి పరిస్థితి ఇదే విధంగా ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. 11,000 మంది శాశ్వత ఉద్యోగులను కలిగిన ఈ సంస్థ మార్చి

Most from this category