STOCKS

News


జీఎంఆర్ ప్లాంటుపై అదానీ కన్ను

Tuesday 28th August 2018
news_main1535433927.png-19713

హైదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి చెందిన విద్యుత్ ప్లాంటు టేకోవర్ ప్రయత్నాలను అదానీ పవర్ ముమ్మరం చేసింది. జీఎంఆర్ చత్తీస్‌గఢ్ ఎనర్జీ (జీఎంఆర్‌సీఈ) కొనుగోలుకు సంబంధించిన డీల్‌ దాదాపు తుదిదశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కింద జీఎంఆర్‌సీఈకి చెందిన రూ. 5,800 కోట్ల రుణభారంలో దాదాపు రూ. 3,800 కోట్లు,  అలాగే రూ. 1,400 కోట్ల నిధులయేతర భారం అదానీ పవర్‌కు బదలాయింపు అవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రుణదాతలు లాంఛనంగా ఆమోదముద్ర వేసిన తర్వాత మరికొన్ని వారాల్లో డీల్‌ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వివరించాయి. జీఎ౾ంఆర్‌ చత్తీస్‌గఢ్ కింద రెండు 685 మెగావాట్‌ బొగ్గు ఆధారిత పవర్ యూనిట్లు ఉన్నాయి. గతేదాడి వీటిలో వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక కింద జీఎ౾ంఆర్‌ చత్తీస్‌గఢ్ నియంత్రణాధికారాలను బ్యాంకులు గతేడాది జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంక్ సారథ్యంలోని  బ్యాంకుల కన్సార్షియం రూ. 3,000 కోట్ల రుణాలను సంస్థలో 52 శాతం వాటాల కింద మార్చుకున్నాయి. దీన్ని కొనుగోలు చేసేందుకు అదానీ పవర్‌తో పాటు వేదాంత, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ప్రభుత్వ రంగ ఎన్ఎల్‌సీ ఇండియా తదితర సంస్థలు నాన్‌-బైండింగ్ బిడ్లు దాఖలు చేసినట్లు కంపెనీకి రుణాలిచ్చిన పవర్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ గతంలో వెల్లడించింది. 

కృష్ణగిరిలో జీఎంఆర్‌ ఎస్‌ఐఆర్‌కు శంకుస్థాపన..
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తలపెట్టిన జీఎంఆర్ కృష్ణగిరి స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (జీకేఎస్‌ఐఆర్‌)కు తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ టిడ్కోతో కలిసి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీన్ని ఏర్పాటు చేస్తోంది. కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌లో సుమారు 2,100 ఎకరాల్లో ఈ రీజియన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఆటోమొబైల్‌, ఆటో పరికరాలు, డిఫెన్స్‌ .. ఏరోస్పేస్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్ ప్రాసెసింగ్‌ వంటి హైటెక్ పరిశ్రమలపై జీకేఎస్‌ఐఆర్‌ ప్రధానంగా దృష్టి సారిస్తుందని జీఎంఆర్ ఇన్‌ఫ్రా తెలిపింది. ఇందులో దేశ, విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. "రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు, ప్రత్యక్షంగా .. పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చే సంస్థలకు జీఎంఆర్ దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థలాన్ని లీజుకి ఇస్తుంది. ఆయా సంస్థలు కావాలనుకుంటే పూర్తిగా కొనుక్కోవచ్చు కూడా" అని జీఎంఆర్‌ గ్రూప్ బిజినెస్ చైర్మన్‌ (అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ట్రాన్స్‌పోర్టేషన్ విభాగం) బీవీఎన్ రావు తెలిపారు. 



You may be interested

హజీరా ఎల్‌ఎన్‌జీ నుంచి ‘టోటల్‌’ నిష్క్రమణ

Tuesday 28th August 2018

న్యూఢిల్లీ: హజీరా ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌ నుంచి ఫ్రాన్స్‌ ఇంధన సంస్థ, టోటల్‌ ఎస్‌ఏ వైదొలగింది. హజీరా ఎల్‌ఎన్‌జీలో 26 శాతం వాటాను భాగ‍స్వామ్య సంస్థ, షెల్‌కు విక్రయించామని టోటల్‌ ఎస్‌ఏ తెలిపింది. ఈ మేరకు షెల్‌ కంపెనీతో ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ వాటా విక్రయానికి వివిధ నియంత్రణ సంస్థలు ఆమోదాలు పొందాల్సి ఉందని పేర్కొంది.  షెల్‌ అనుబంధ సంస్థ, షెల్‌ గ్యాస్‌ బీవీ ఈ 26 శాతం

మార్కెట్లోకి డుకాటీ స్క్రాంబ్లర్‌ బైక్‌

Tuesday 28th August 2018

న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ దిగ్గజం డుకాటీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్క్రాంబ్లర్ 1100 బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 10.91 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). అలాగే ఇందులో మరో రెండు వేరియంట్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో స్క్రాంబ్లర్ స్పెషల్ ధర రూ. 11.12 లక్షలు కాగా స్క్రాంబ్లర్ స్పోర్ట్ రేటు రూ. 11.42 లక్షలుగా ఉంటుందని డుకాటీ ఇండియా ఎండీ సెర్గీ కెనోవాస్ తెలిపారు.

Most from this category