STOCKS

News


అదానీ పోర్ట్స్‌ సెజ్‌కు రూపాయి సెగ

Wednesday 24th October 2018
news_main1540359941.png-21420

న్యూఢిల్లీ: అదానీ ​‍గ్రూప్‌నకు చెందిన లాజిస్టిక్స్‌ కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 38 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.992 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 614 కోట్లకు తగ్గిందని అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ తెలిపింది. రూపాయి పతనం కారణంగా రూ. 953 కోట్ల మార్క్‌ టు మార్కెట్‌ నష్టాలు వచ్చాయని కంపెనీ సీఈఓ కరణ్‌ అదానీ చెప్పారు. దీంతో తమ ఆర్థిక పరిస్థితులపై త్రీవ్రమైన ప్రభావం పడిందని వివరించారు. ఫలితంగా స్థూల, నికర లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ. 2,962 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.2,922 కోట్లకు తగ్గిందని తెలిపారు. 
వంద మెట్రిక్‌ మిలియన్‌ టన్నుల కార్గో రవాణా..
మొత్తం వ్యయాలు రూ.1,584 కోట్ల నుంచి రూ.2,123 కోట్లకు పెరిగాయని కరణ్‌ పేర్కొన్నారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు  భారత కార్గోపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయినా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వంద మెట్రిక్‌ మిలియన్‌ టన్నుల కార్గోను రవాణా చేశామని వివరించారు. కంపెనీ చరిత్రలో ఈ స్థాయి కార్గోను రవాణా చేయడం ఇదే మొదటిసారని, తమ అన్ని పోర్ట్‌లు అన్ని రకాలైన సరుకు రవాణా చేయడం వల్ల ఈ మైలురాయిని సాధించామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వందల మిలియన్‌ టన్నుల కార్గోను రవాణా చేయగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పోర్ట్‌ ఎబిటా మార్జిన్లు 70 శాతం నుంచి 71 శాతానికి పెరగగలవని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఏపీసెజ్‌ షేర్‌ 1.1 శాతం లాభంతో రూ.318 వద్ద ముగిసింది. You may be interested

ఇక మరిన్ని కంపెనీల పెట్రోల్‌ బంక్‌లు!

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: ఇంధనాల రిటైలింగ్ వ్యాపారంలో పోటీని ప్రోత్సహించటంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనికోసం లైసెన్సింగ్‌ నిబంధనలను సరళీకరించాలనే ఉద్దేశంతో... నిపుణుల కమిటీని నియమించింది. మరిన్ని ప్రైవేట్ సంస్థలు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేసేందుకు తోడ్పడే అంశాలను ఈ కమిటీ సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం దేశీయంగా ఇంధన రిటైలింగ్ లైసెన్స్ పొందాలంటే.. హైడ్రోకార్బన్స్ అన్వేషణ, ఉత్పత్తి, రిఫైనింగ్‌, పైప్‍లైన్ల లేదా ద్రవీకృత సహజ వాయువు టర్మినల్స్ ఏర్పాటు మొదలైన వాటిపై రూ.2,000

సరికొత్త ‘శాంత్రో’ వచ్చేసింది

Wednesday 24th October 2018

న్యూఢిల్లీ: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హ్యుందాయ్‌ శాంత్రో’ రానేవచ్చింది. హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) సోమవారం ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మార్కెట్‌లోకి విడుదలచేసింది. దేశీ రోడ్లపై 16 ఏళ్ల పాటు ప్రయాణించి... 2014 డిసెంబర్‌ నుంచి నిలిచిపోయిన ఈ కారు.. ఫ్యాక్టరీ నుంచే సీఎన్‌జీ ఇంధన ఆప్షన్‌, 5 స్పీడ్‌- ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ), 1.1 లీటర్‌, ఫోర్‌ సిలిండర్ ఇంజిన్‌ వంటి అధునాతన ఫీచర్లతో రీ

Most from this category