STOCKS

News


అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లాభం రూ.697 కోట్లు

Tuesday 7th August 2018
news_main1533618246.png-18990

న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ ‍స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీ సెజ్‌) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.697 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం రూ.768 కోట్లతో పోల్చితే 9 శాతం క్షీణత నమోదైందని ఏపీ సెజ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,960 కోట్ల నుంచి రూ.2,704 కోట్లకు తగ్గిందని ఏపీసెజ్‌ సీఈఓ కరణ్‌ అదానీ తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.2,867 కోట్ల నుంచి రూ.1,781 కోట్లకు తగ్గాయని,  కార్గో పరిమాణం 9 శాతం పెరిగిందని వివరించారు. ఈ క్యూ1లో కట్టుపల్లి పోర్ట్‌ కొనుగోలు లావాదేవీ పూర్తయిందని, వైజాగ్‌ టెర్మినల్‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని తెలిపారు. 
ఆర్థిక ఫలితాల నేపథ్యలో బీఎస్‌ఈలో ఏపీసెజ్‌ షేర్‌ 0.5 శాతం నష్టపోయి రూ.398 వద్ద ముగిసింది. 



You may be interested

ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌నందా కన్నుమూత

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ఎస్కార్ట్స్‌ గ్రూపు చైర్మన్‌ రాజన్‌ నందా (76) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నందా 1965లో 23 ఏళ్ల వయసులో ఎస్కార్ట్స్‌లో చేరారు. 1994లో తన తండ్రి, గ్రూపు వ్యవస్థాపక చైర్మన్‌ హెచ్‌పీ నందా తప్పుకోవడంతో, ఆ బాధ్యతలు స్వీకరించి గ్రూపు చైర్మన్‌ అయ్యారు. పలు వాణిజ్య, పారిశ్రామిక సంఘాల్లో ఆయన సభ్యులుగా ఉన్నారు. సీఐఐ నేషణల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా, వ్యవసాయ

ఉజ్జీవన్ ఫైనాన్షియల్ నికర లాభం రూ.45 కోట్లు

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (క్యూ1)లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. నిర్వాహణ ఆదాయం పెరిగిన కారణంగా నికర లాభం రూ.45 కోట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.74.90 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలానికి ఆదాయం రూ.460 కోట్లకు చేరుకోగా.. అంతకుముందు ఇదేకాలంతో పోల్చితే 28.4 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది. నికర వడ్డీ

Most from this category