News


పెట్రోలియం వ్యాపారంలోకి అదానీ గ్రూపు

Friday 18th January 2019
Markets_main1547789277.png-23653

- జర్మన్‌ సంస్థ బీఏఎస్‌ఎఫ్‌తో జట్టు
- రూ.16,000 కోట్లతో ముంద్రాలో కెమికల్‌ ప్లాంటు

న్యూఢిల్లీ: గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు పెట్రో కెమికల్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. జర్మనీ దిగ్గజ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌తో కలసి గుజరాత్‌లోని ముంద్రా జిల్లాలో 2 బిలియన్‌ యూరోలతో (రూ.16,000 కోట్లతో) పెట్రో కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇరు సంస్థలు ఈ మేరకు గురువారం ‘వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2019’ వేదికగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. పెట్రోకెమికల్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ అవసరాలు తీర్చుకునేందుకు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌, పవన విద్యుత్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నాయి. పెట్రోకెమికల్‌ ప్లాంట్‌లో బీఏఎస్‌ఎఫ్‌కు మెజారిటీ వాటా, అదానీ గ్రూపునకు మైనారిటీ వాటా ఉంటాయి. ఇక విద్యుత్‌ ప్లాంట్‌ వెంచర్‌లో బీఏఎస్‌ఎఫ్‌ మైనారిటీ వాటా తీసుకుంటుంది. పెట్రోకెమికల్‌ రంగంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పటి వరకు మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ఇద్దరు గుజరాతీ బిలియనీర్లు ముకేశ్‌, గౌతం అదానీ ఒక వ్యాపారంలో నేరుగా పోటీ పడడం ఇదే ప్రథమం. అదానీ, బీఏఎస్‌ఎఫ్‌ ప్లాంట్‌ ద్వారా ప్రొపేన్‌ డీహైడ్రోజెనేషన్‌, ఆక్సో సీ4 కాంప్లెక్స్‌, గ్లాసియల్‌ అక్రిలిక్‌ యాసిడ్‌, బూటిల్‌ అక్రిలేట్‌ను తయారు చేయనున్నాయి. వీటిని నిర్మాణం, ఆటోమోటివ్‌, కోటింగ్స్‌ విభాగాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండటంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, భారత్‌లో తయారీకి తమ ప్లాంట్‌ మద్దతుగా నిలుస్తుందని ఇరు సంస్థలూ సంయుక్తంగా తెలియజేశాయి. భారత్‌లో తమకు ఇదే అతిపెద్ద పెట్టుబడిగా బీఏఎస్‌ఎఫ్‌ పేర్కొంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయాన్ని 2019 చివరికల్లా పూర్తి చేస్తామని ప్రకటించింది.
భారత్‌లో తయారీకి మద్దతుగా: అదానీ
‘‘దేశంలో మధ్యతరగతి గణనీయంగా పెరుగుతండడంతో పెట్రోకెమికల్స్‌ను భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో విలువైన విదేశీ మారకం బయటకు వెళుతోంది. మా భాగస్వామ్యం ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ప్రోత్సాహంగా నిలుస్తుంది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న సీ3 కెమికల్‌ వ్యాల్యూ చెయిన్‌తోపాటు పలు కెమికల్స్‌ను మా ప్లాంట్‌ తయారు చేస్తుంది’’ అని గౌతం అదానీ ప్రకటించారు. కెమికల్స్‌ వ్యాపారానికి ముంద్రా మౌలిక సదుపాయాలు మంచి అనుకూలమని పేర్కొన్నారు.You may be interested

వడ్డీ రేట్లు తగ్గించాలి

Friday 18th January 2019

- ద్రవ్య లభ్యత పరిస్థితులను మెరుగుపరచాలి - అప్పుడే వృద్ధికి బలం - ఆర్‌బీఐకి సీఐఐ, ఫిక్కీ సూచనలు న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్‌బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి

బైజూ చేతికి అమెరికన్‌ కంపెనీ ఓస్మో

Friday 18th January 2019

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ విద్యా సంస్థ బైజూస్‌ అమెరికాకు చెందిన ఓస్మో కంపెనీని 120 మిలియన్‌ డాలర్లకు (రూ.850 కోట్లు) కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. ఆటలతో కూడిన విద్యా విధానాలను ఓస్మో అందిస్తుంటుందని, భౌతిక రూపంలో ఉన్న బొమ్మలను ఆగ్మెంటెడ్‌ రియాలిటీ విధానంలో డిజిటల్‌ ప్రపంచంలోకి తీసుకురానున్నమని తెలిపింది. ఓస్మో స్వతంత్ర బ్రాండ్‌గానే కొనసాగుతుందని బైజూన్‌ ప్రకటించింది. అయితే, భౌతిక రూపం నుంచి డిజిటల్‌ రూపంలోకి మార్చే ఓస్మో సామర్థ్యాలు, కంటెంట్‌ను

Most from this category