STOCKS

News


ఎయిర్‌పోర్ట్‌ రంగంలోకి అదానీ!

Tuesday 19th February 2019
news_main1550560810.png-24254

  •  ఆరు విమానాశ్రయాల నిర్వహణ కోసం బిడ్లు

ముంబై: విమానాశ్రయాల నిర్వహణ రంగంలోకి ప్రవేశించాలని అదానీ గ్రూప్‌ యోచిస్తోంది. అందుకే ఏఏఐ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ప్రైవేట్‌ పరం చేయనున్న ఆరు విమానాశ్రయాల కోసం బిడ్‌లను దాఖలు చేసింది. ఏఏఐ తన ఆధ్వర్యంలోని ఆరు విమానాశ్రయాలను ప్రైవేట్‌ పరం చేయనుండటం తెలిసిందే. అహ్మదాబాద్‌, జైపూర్‌, లక్నో, త్రివేండ్రం, మంగళూరు, గౌహతిల్లోని విమానాశ్రయా నిర్వహణను ప్రైవేట్‌ రంగానికి అప్పగించనుంది. ఇందుకు గాను బిడ్లను ఆహ్వానించింది. ఈ విమానాశ్రయాలను నిర్వహించడానికి పదికి పైగా కంపెనీలు తమ బిడ్‌లను సమర్పించాయి. ఈ కంపెనీల్లో  జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఉన్నాయి. ఇటలీకి చెందిన ఆటోస్ట్రాడ్‌, ఇంగ్లాండ్‌కు చెందిన ఏఎమ్‌పీ క్యాపిటల్‌ ఇన్వెస్టర్స్‌, మారిషస్‌ నుంచి ఐ ఇన్వెస్ట్‌మెంట్స్‌, కొచ్చిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, కేరళ స్టేట్‌  ఇండస్డ్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సన ఎంటర్‌ప్రైజెస్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు కూడా బిడ్‌లను సమర్పించాయి. అధిక మొత్తం ప్యాసింజర్‌ ఫీజు కోట్‌చేసిన కంపెనీలకు ఆయా విమానాశ్రయాల నిర్వహణ దక్కుతుంది. బిడ్‌లను ఈ నెల 28న తెరుస్తారు. జీఎమ్‌ఆర్‌ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఫెయిర్‌ఫాక్స్‌ ఇండియా, జీవీకే గ్రూప్‌ మాత్రం బిడ్లను దాఖలు చేయలేదు.



You may be interested

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.28వేల కోట్లు!

Tuesday 19th February 2019

మధ్యంతర డివిడెండ్‌ రూపంలో వెసులుబాటు అంతక్రితం ఆర్‌బీఐ బోర్డ్‌నుద్దేశించి ప్రసంగించిన జైట్లీ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి) ‍కేంద్రం ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ మంత్రి

నోట్లరద్దు సమాచారం రహస్యమా?

Tuesday 19th February 2019

ఆర్‌బీఐని తప్పుబట్టిన కేంద్ర సమాచార కమిషన్‌ పొరపాటున అలా చెప్పామన్న రిజర్వు బ్యాంకు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఆర్‌బీఐ బోర్డు సమావేశమై ఏం చర్చించిందనేది వెల్లడించడానికి నిరాకరించడాన్ని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తప్పుబట్టింది. ఇదే విషయమై సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌కు సైతం షోకాజు నోటీసు జారీ చేసింది. డీమోనిటైజేషన్‌ నిర్ణయానికి ముందు... అందుకు సంబంధించి జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం వివరాలు,

Most from this category