STOCKS

News


అదానీ చేతికి కేఈసీ బికనీర్‌ ట్రాన్స్‌మిషన్‌

Monday 5th November 2018
news_main1541393642.png-21702

న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ అదానీ ట్రాన్స్‌మిషన్‌ తాజాగా కేఈసీ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌నకు చెందిన సంస్థను కొనుగోలు చేయనుంది. కేఈసీ బికనీర్‌ సికర్ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలో (కేబీఎస్‌టీపీఎల్‌) కేఈసీ ఇంటర్నేషనల్‌కి ఉన్న మొత్తం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 227.50 కోట్లుగా ఉండనుంది. కేబీఎస్‌టీపీఎల్‌ ప్రాజెక్టు కింద 344 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేటీ) మేర ట్రాన్స్‌మిషన్ లైన్స్ వేయాల్సి ఉంటుంది. తాజా కొనుగోలుతో తమ నెట్‌వర్క్ పరిధి మొత్తం 12,923 సీకేటీకి చేరుతుందని అదానీ ట్రాన్స్‌మిషన్ తెలిపింది. 



You may be interested

మూడు నెలల్లో 76కి రూపాయి: యూబీఎస్‌

Monday 5th November 2018

ముంబై: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడుల రాక తగ్గడం, అధిక క్రూడ్ రేట్లు తదితర అంశాల కారణంగా రూపాయి ఇప్పటికే 74 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ

డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?

Monday 5th November 2018

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర

Most from this category