News


అనుమతి లేకుండా మొండిబాకీలుగా ప్రకటించొద్దు

Tuesday 26th February 2019
news_main1551156820.png-24337

  • ఐఎల్‌ఎఫ్‌ఎస్ ఖాతాలపై బ్యాంకులకు ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలు

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థల ఖాతాలను తమ అనుమతి లేకుండా మొండిపద్దుల కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రకటించరాదని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సంస్థ రుణ పరిష్కార ప్రణాళిక సజావుగా జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దాదాపు రూ. 90,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కొత్త మేనేజ్‌మెంట్‌.. ఆస్తుల విక్రయ ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలు కోసం ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌లో కాస్త మెరుగ్గా ఉన్న 22 కంపెనీలు తమ తమ రుణాల చెల్లింపు ప్రక్రియలను యథావిధిగా కొనసాగించేందుకు ఫిబ్రవరి 11న హియరింగ్‌లో ఎన్‌సీఎల్‌ఏటీ అనుమతించింది. అలాగే, రుణ పరిష్కార ప్రక్రియ పర్యవేక్షణకు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నియామకానికి ఆమోదముద్ర వేసింది.



You may be interested

త్వరలో రిలయన్స్‌ రిటైల్‌ ఐపీఓ !

Tuesday 26th February 2019

జూన్‌ తర్వాత ఐపీఓకు  6,400 నగరాల్లో 9,900కు పైగా రిటైల్‌ స్టోర్స్‌ ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ త్వరలోనే ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నదని సమాచారం.   ఈ ఏడాది జూన్‌ తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ ఐపీఓ ఉండొచ్చని, ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రాగలదని అంచనాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రిలయన్స్‌ రిటైల్‌తో పాటు ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన మొబైల్‌ వెంచర్‌,

సంక్షోభం నుంచి బైటపడేందుకు జెట్ కసరత్తు

Tuesday 26th February 2019

రుణపరిష్కార ప్రణాళిక ఖరారుపై దృష్టి మళ్లీ లాభాల్లోకి మళ్లుతామని ధీమా     న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడేందుకు ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. బ్యాంకులు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను ఖరారు చేసేందుకు సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రణాళిక అమలు ద్వారా మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని ధీమా వ్యక్తం చేసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ చైర్మన్ నరేశ్ గోయల్‌ , సంస్థలో

Most from this category