STOCKS

News


ఏసీసీ లాభం రూ.209 కోట్లు

Thursday 18th October 2018
news_main1539833701.png-21250

న్యూఢిల్లీ: సిమెంట్‌ కంపెనీ ఏసీసీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన మూడో  త్రైమాసిక కాలంలో 15 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది  క్యూ3లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది క్యూ3లో రూ.209 కోట్లకు పెరిగిందని ఏసీసీ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,141 కోట్ల​ నుంచి 10 శాతం వృద్ధితో రూ.3,466 కోట్లకు పెరిగిందని ఏసీసీ ఎమ్‌డీ, సీఈఓ నీరజ్‌ అఖోరి చెప్పారు.  దీంట్లో సిమెంట్‌  విభాగం ఆదాయం రూ.3,185 కోట్లుగా, రెడీ మిక్స్‌ ​కాంక్రీట్‌ విభాగం ఆదాయం రూ.303 కోట్లుగా ఉన్నాయని వివరించారు. మొత్తం వ్యయాలు రూ.2,877 కోట్ల నుంచి రూ.3,160 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ కంపెనీ జనవరి-డిసెంబర్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తోంది. 
డిమాండ్‌ మరింతగా వృద్ధి....
గత ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 5.96 మిలియన్‌ టన్నులుగా ఉన్న సిమెంట్‌ అమ్మకాలు ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 10 శాతం పెరిగి 6.55 మిలియన్‌ టన్నులకు చేరాయని నీరజ్‌  పేర్కొన్నారు.  రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ అమ్మకాలు 12 శాతం పెరిగాయని తెలిపారు.  ఉత్పత్తి వ్యయాల సంబంధిత సమస్యలున్నా, ఆర్థికంగా పనితీరు సానుకూలంగానే కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక రంగానికి, అందుబాటు గృహాల నిర్మాణానికి  ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడంతో సిమెంట్‌కు డిమాండ్‌ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. రానున్న ఏడాది సిమెంట్‌కు డిమాండ్‌ మరింతగా వృద్ధి చెందగలదని పేర్కొన్నారు. పనితీరు మెరుగుపరచుకోవడానికి నిర్వహణ సామర్థ్యాలపై దృష్టి పెడుతున్నామని వివరించారు. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో​ బీఎస్‌ఈలో ఏసీసీ షేర్‌ 2.1 శాతం నష్టంతో రూ.1,518 వద్ద ముగిసింది. 


ACC

You may be interested

మైండ్‌ ట్రీ లాభం 65 శాతం అప్‌

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 65 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.125 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.206 కోట్లకు పెరిగిందని మైండ్‌ ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,332 కోట్ల నుంచి 32 శాతం పెరిగి రూ.1,755 కోట్లకు చేరిందని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌

సత్యం కేసులో సెబీ తీర్పు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్‌ స్కాం కేసులో పాక్షిక మార్పులతో కూడిన తీర్పును సెబి వెలువరించింది. దీని ప్రకారం కంపెనీ మాజీ సీఎఫ్‌వో వడ్లమూడి శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.రామకృష్ణపై ఏడేళ్ల పాటు, ఇంటర్నల్‌ ఆడిట్‌ మాజీ హెడ్‌ వి.ఎస్‌.ప్రభాకర గుప్తాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో వారు సెక్యూరిటీ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే కొనసాగుతున్న నిషేధ కాలంతో కలిపి ఈ పీరియడ్‌ ఉంటుంది.

Most from this category