STOCKS

News


రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో వాటా కోసం దిగ్గజ సంస్థల పోటీ

Tuesday 11th September 2018
news_main1536642591.png-20157

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌లో వాటా కొనుగోలు కోసం దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం.  రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ 24.99 శాతం వాటాను విక్రయానికి పెట్టింది. ఈ వాటా కొనుగోలు కోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, సింగపూర్‌ సావరిన్‌ ఫండ్‌ జీఐసీ, పబ్లిక్‌ సెక్టర్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ ఆఫ్‌ కెనడాలు రేసులో ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  ఈ వాటా విక్రయం కారణంగా రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌రూ.1,500-2,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కాగా ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రతినిధి నిరాకరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ మొత్తం ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.1,671 కోట్లకు, స్థూల లాభం 97 శాతం వృద్ధితో రూ.272 కోట్లకు పెరిగాయి.



You may be interested

ఎస్సార్‌ స్టీల్ కొనుగోలుకు  ఆర్సెలర్‌ మిట్టల్ తాజా బిడ్‌

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: భారీ రుణాల్లో కూరుకుపోయిన ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు ఆర్సెలర్‌ మిట్టల్‌ సోమవారం ఉదయం తాజా బిడ్‌ దాఖలు చేసింది. జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటోమో మెటల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఈ బిడ్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. బిడ్‌ విలువ ఎంతన్నది అధికారికంగా తెలియనప్పటికీ, ఈ మొత్తం రూ.42,000 కోట్లు ఉండవచ్చని వినిపిస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ రుణ దాతలకు తిరిగి చెల్లింపులు చేయటానికి ఆర్సెలర్‌ మిట్టల్‌ ఈ

హార్లిక్స్‌ రేసులో కోక-కోలా

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: మాల్ట్‌ ఆధారిత హెల్త్‌ డ్రింక్‌ హార్లిక్స్‌ కొనుగోలు రేసులో తాజాగా కోక-కోలా కూడా చేరింది. గ్లాక్సో స్మిత్‌లైన్‌ (జీఎస్‌కే) కంపెనీ హార్లిక్స్‌ బ్రాండ్‌ను భారత్‌లో విక్రయానికి పెట్టింది. ఈ 145 ఏళ్ల బ్రాండ్‌ను 390 కోట్ల డాలర్లకు (300 కోట్ల పౌండ్లు)విక్రయించాలని జీఎస్‌కే యోచిస్తోందని ఇంగ్లాండ్‌కు చెందిన సండే టెలిగ్రాఫ్‌ వెల్లడించింది. హార్లిక్స్‌ బ్రాండ్‌ను చేజిక్కించుకోవడానికి అంతర్జాతీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ సంస్థలు-నెస్లే, క్రాఫ్ట్‌ హీంజ్‌ తదితర సంస్థలు పోటీపడుతున్నాయి.

Most from this category