STOCKS

News


8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు

Saturday 8th September 2018
news_main1536380659.png-20073

న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్‌ చార్జింగ్‌ సిస్టమ్‌’ను ఏబీబీ భారత మార్కెట్‌ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్‌ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పీసోఫర్‌ ప్రశంసించారు. మూవ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఎలక్ట్రిక్‌ రవాణాకు ఏబీబీ తన టెక్నాలజీలతో సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ‘‘కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్‌ ఇండస్ట్రీ ఫెయిర్‌లో నూతన టెర్రా హైపవర్‌ ఈవీ చార్జర్‌ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్‌తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఈ తరహా ఫాస్ట్‌ చార్జర్‌ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది’’ స్పీసోఫర్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్‌గా ఉన్నామని, టోసా సిస్టమ్‌ కేవలం 20 సెకండ్ల బరస్ట్‌తో ఓ బస్సు రోజంతా నడిచేలా చేయగలదన్నారు. 



You may be interested

అశోక్‌లేలాండ్‌ ఎన్నోర్‌ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ

Saturday 8th September 2018

చెన్నై: హిందుజా గ్రూపులో భాగమైన అశోక్‌లేలాండ్‌, తమిళనాడులోని ఎన్నోర్‌ ప్లాంట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సదుపాయాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఇక్కడ డిజైన్‌, ప్రొటోటైపింగ్‌, టెస్టింగ్‌, సొల్యూషన్స్‌ డిజైన్‌ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా కేంద్రాన్ని తీర్చిదిద్దింది. కంపెనీ 70వ వార్షికోత్సవం రోజే ఈ ప్రారంభోత్సవం జరగడం గమనార్హం. తేలికపాటి వాణిజ్య వాహనాలు, తక్కువ ఎత్తు ఉండే సిటీ బస్సులు తదితర ఎలక్ట్రిక్‌ వాహనాలను ఇక్కడ తయారు చేయాలన్నదే

మెరుగైన రవాణాతోనే ఆర్థిక వృద్ధి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: మెరుగైన రవాణాతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, బ్యాటరీలు, స్మార్ట్‌ చార్జింగ్‌ సదుపాయాలు సహా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి అన్ని విభాగాల్లో (చైన్‌) పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. పర్యావరణంపై పోరుకు శుద్ధ ఇంధన ఆధారిత రవాణా మన చేతుల్లో ఉన్న శక్తిమంతమైన ఆయుధంగా పేర్కొన్నారు. కార్లపైనే కాకుండా స్కూటర్లు, ఆటో రిక్షాల తయారీపైనా దృష్టి సారించాలన్నారు.

Most from this category