STOCKS

News


హిటాచీ చేతికి ఏబీబీ పవర్ వ్యాపారం

Tuesday 18th December 2018
news_main1545109696.png-23028

న్యూఢిల్లీ: స్విస్ ఇంజినీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్‌ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్‌ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు 2020 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కావొచ్చని అంచనా. డీల్ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్ వెంచర్‌లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్ రేటుకు విక్రయించేసి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్ గ్రిడ్ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ డీల్ లాభించనుంది. 
ప్రధానంగా పారిశ్రామిక రోబోల తయారీలో ఉన్న ఏబీబీ... ఆటోమేషన్ వంటి విభాగాలపై దృష్టి పెట్టే క్రమంలో అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్‌ తోడ్పడనుంది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్ డాలర్ల మేర వ్యయాలు తగ్గుతాయని ఏబీబీ  వివరించింది.  జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్ గ్రిడ్‌ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1 శాతం వాటాలను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది. 
10 బిలియన్ డాలర్ల టర్నోవరు ..
ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్ సరఫరా పరికరాలు, కంట్రోల్ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో 36,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ స్వల్పంగా 60 బేసిస్ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితమే పవర్‌ గ్రిడ్స్‌ విభాగాన్ని విక్రయించేయాలంటూ కొందరు షేర్‌హోల్డర్ల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ.. ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పైస్‌హోఫర్‌ అంగీకరించలేదు. కానీ తాజాగా యూ-టర్న్ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద క్లోజయ్యింది.



You may be interested

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి లీలా హోటల్స్‌ !

Tuesday 18th December 2018

కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ భారత ఆతిథ్య రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సంస్థ హోటల్‌ లీలా వెంచర్‌ను చెందిన హోటళ్లను, బ్రాండ్‌ను రూ.4,500 కోట్లకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. భారీ రుణభారంతో కుదేలైన హోటల్‌ లీలా వెంచర్‌కు ఈ డీల్‌ ఊరట నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హోటల్‌ లీలా వెంచర్‌కు రూ.3,799 కోట్ల మేర రుణభారం ఉంది.  తుది దశలో డీల్‌...!  ఈ డీల్‌లో భాగంగా హోటల్‌ లీలా

బైజూస్‌కు 540 మిలియన్‌ డాలర్ల నిధులు

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌ తాజాగా 540 (రూ.3,888 కోట్లు) మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. దీంతో సంస్థ వ్యాల్యూషన్‌ 3.6 బిలియన్‌ డాలర్లతో (రూ.25,920 కోట్లు), దేశంలో నాలుగో అతిపెద్ద స్టార్టప్‌గా నిలిచింది. పేటీఎం, ఓలా, ఓయో రూమ్స్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాస్పర్స్‌, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (సీపీపీఐబీ), జనరల్‌ అట్లాంటిక్‌ తాజా నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొని బైజూస్‌లో పెట్టుబడులు పెట్టాయి.

Most from this category