STOCKS

News


కొత్త విభాగాల్లో ఏబీబీ తయారీ కేంద్రాలు

Tuesday 28th August 2018
news_main1535432921.png-19701

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న ఏబీబీ ఇండియా నూతన విభాగాల్లో తయారీ కేంద్రాలను నెలకొల్పనుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ దిగ్గజ సంస్థకు పవర్, హెవీ ఎలక్ట్రిక్, ఆటోమేషన్‌ వంటి విభాగాల్లో ఇప్పటికే భారత్‌లో 47 ప్లాంట్లున్నాయి. కొత్త ప్లాంట్లు డిజిటలైజేషన్, ఎనర్జీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ చార్జింగ్‌ వంటి సెగ్మెంట్లలో ఉంటాయని ఏబీబీ ఇండియా ఎండీ సంజీవ్‌ శర్మ వెల్లడించారు. కంపెనీ ప్రతినిధులు కార్తిక్‌ కృష్ణమూర్తి, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. క్యాపెక్స్‌ ఏటా సుమారు రూ.700 కోట్లు ఉంటోందని వెల్లడించారు. ఆర్డర్‌ బుక్‌ రూ.12,000 కోట్లుందని చెప్పారు. 2017–18లో కంపెనీ రూ.9,200 కోట్లు ఆర్జించింది. ఏటా 13 శాతం వృద్ధి సాధిస్తోంది.



You may be interested

గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇక ఓలెక్ట్రా

Tuesday 28th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ పేరు మారింది. ఇకనుంచి ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌గా పిలుస్తారు. చైనాకు చెందిన బీవైడీ ఆటో ఇండస్ట్రీ భాగస్వామ్యంతో 2016లో ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. హిమాచల్‌ ప్రదేశ్, ముంబైలో ప్రస్తుతం ఈ బస్సులు పరుగెడుతున్నాయి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌కు కలిపి 290 బస్‌ల సరఫరాకు ఇటీవలే బిడ్స్‌ను దక్కించుకున్నామని ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఈడీ ఎన్‌.నాగసత్యం

ఆతిథ్య రంగంలోకి ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా

Tuesday 28th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రియల్టీ రంగంలో ఉన్న ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌... అతిథ్య రంగంలోకి ప్రవేశించింది. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఉన్న హాంప్‌షైర్‌ ప్లాజా హోటల్‌ను కొనుగోలు చేసింది. డీల్‌ విలువ రూ.42 కోట్లు. ఈ ఏడాదే గోవాలోనూ ఓ హోటల్‌ను టేకోవర్‌ చేయనున్నట్టు ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ సీవోవో ప్రవీణ్‌ కుమార్‌ నెడుగండి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ఆతిథ్య రంగంలో

Most from this category