News


ఖాతా ప్రారంభానికి ఆధార్‌ తప్పనిసరి కాదు: ఎస్‌బీఐ

Thursday 27th September 2018
news_main1538024026.png-20625

ముంబై: సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం బ్యాంకులో ఖాతా ప్రారంభించడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని, అయితే.. ఖాతాదారులు స్వచ్ఛందంగా ఆధార్‌ సమర్పించవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆధార్‌ స్కీంను గొప్ప సౌకర్యంగా అభివర్ణించిన ఆయన.. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ‘ఆన్‌లైన్‌ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే ఖాతా ప్రారంభమవడమే కాకుండా, తక్షణ నిర్వహణ సౌకర్యం అందుబాటులో ఉండడానికి ప్రధాన ఆధార్‌ కారణం. 80-85 శాతం బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయి. యోనో ప్లాట్‌ఫామ్‌ ద్వారా రోజుకు 27,000 డిజిటల్‌ అకౌంట్లు ప్రారంభమవుతున్నాయి.’ అని వివరించారు.



You may be interested

పటిష్ట వృద్ధి బాటనే భారత్‌!

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19), అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌ ఆరికాభివృద్ధి రేట్లు వరుసగా 7.3 శాతం, 7.6 శాతం నమోదవుతాయని విశ్లేషించింది. ‘ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2018’ పేరుతో విడుదలైన ఏడీబీ వార్షిక ఆర్థిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ భారత్‌కు కొన్ని సవాళ్లూ ఉన్నాయి. రూపాయి బలహీనత,

మరో విడత రేటు పెంపు ఖాయం!

Thursday 27th September 2018

బెంగళూరు: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్‌ 5వ తేదీన జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను మరో పావుశాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు

Most from this category