STOCKS

News


పార్లమెంట్‌ ముందుకు ఆధార్‌ సవరణ బిల్లు

Thursday 3rd January 2019
Markets_main1546493657.png-23383

న్యూఢిల్లీ: బయోమెట్రిక్ ఐడీ ఆధార్ చట్ట సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్లు మొదలైనవి పొందడానికి వినియోగదారులు గుర్తింపు ధృవీకరణ పత్రం కింద ఆధార్‌ను స్వచ్ఛందంగా మాత్రమే ఇచ్చేలా ఇందులో ప్రతిపాదనలున్నాయి. ఆధార్ ఇవ్వడానికి ఇష్టపడని వారికి బ్యాంకు ఖాతా, సిమ్ కార్డులు మొదలైన సర్వీసులు అందించకుండా ఆయా సంస్థలు నిరాకరించడానికి ఉండదు. స్వచ్ఛందంగా ఆధార్‌ నంబర్ ఇచ్చిన వారి బయోమెట్రిక్ వివరాలను సర్వీస్ ప్రొవైడర్లు తమ సర్వర్లలో భద్రపర్చుకోరాదు. అలాగే, ఆధార్‌ను దుర్వినియోగం చేసే కంపెనీలపై రూ.1 కోటిదాకా జరిమానా, నిబంధనలు ఉల్లంఘన జరిగినంత కాలం రోజుకు రూ.10 లక్షల దాకా అదనంగా పెనాల్టీ విధించేందుకు యూఐడీఏఐకి అధికారాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ప్రయోజనాల కోసం ఈ బిల్లు కింద ఆధార్‌ చట్టం 2016తో పాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002ని కూడా సవరించనున్నారు.



You may be interested

ఆరున్నర నెలల గరిష్టానికి పసిడి

Thursday 3rd January 2019

ఆర్థిక వృద్ధి మందగమనం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో అస్థిరత పసిడి ధరకు కలిసొస్తున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం 9డాలర్లు లాభపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత సైతం పసిడి ర్యాలీకి సహకరిస్తోంది. ఉదయం 11:45ని.లకు ఔన్స్‌ పసిడి ధర 8.85 డాలర్ల లాభపడి 1,292.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది పసిడి ధరకు ఆరున్నర నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. జపాన్‌ కరెన్సీ యెన్‌ ర్యాలీ

చిన్న పరిశ్రమల వృద్ధిపై ఆర్‌బీఐ దృష్టి

Thursday 3rd January 2019

సిన్హా నేతృత్వంలో నిపుణలు కమిటీ వచ్చేవారం ఈ రంగం ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సమావేశం కానున్నారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో

Most from this category