STOCKS

News


30 ఏళ్లకే వైద్య బీమా...: మెజారిటీ మనోగతం

Friday 11th January 2019
news_main1547145597.png-23513

ఆరోగ్యకరమైన సమస్యలు భారతీయులకు నేడు సవాలుగా మారాయి. అనారోగ్యం బారిన పడితే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. అందుకేనేమో మన దేశంలో 85 శాతం మంది 30 ఏళ్లకే వైద్య బీమాను తీసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. 62.8 శాతం మంది అయితే వైద్య బీమా ఉండడం తప్పనిసరి అని భావిస్తున్నారు. జీవోక్యూఐఐ-ఇండియా ఫిట్‌ 2019 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పట్ల నమ్మకం తగ్గిపోతుందని ఈ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 96.5 శాతం మంది దీన్ని విశ్వసించడం లేదని తెలిసింది. ఏడాది పాటు 7 లక్షల మందికి పైగా అద్యయనం చేసి, తెలుసుకున్న వివరాలతో జీవోక్యూఐఐ ఈ నివేదికను విడుదల చేసింది. వైద్య బీమా గురించి ప్రజలు ఏమని ఆలోచిస్తున్నారు? దీన్ని ఆరోగ్యంపై పెట్టుబడిగా భావిస్తున్నారా అన్న అంశాలను అధ్యయనంలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేసింది. 

 

వైద్య బీమా పాలసీ ప్రాముఖ్యత, అవసరంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ... 20 శాతం మంది ఇప్పటికీ వైద్య బీమా పాలసీ కలిగి లేరు. బీమా అన్నది అర్థం కాని వ్యవహారం అన్న భావన ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి తోడు అధిక ఖర్చు పాలసీ కొనుగోలుకు వారిని దూరంగా ఉండేలా చేస్తున్నట్టు తెలిపింది. ఆరోగ్యవంతులైన వారు తమ పాలసీలకు తక్కువ ప్రీమియం చెల్లించొచ్చని 90 శాతం మంది భావిస్తున్నారు. ప్రీమియంపై తగ్గింపు కోసం తమ ఆరోగ్య సమాచారాన్ని బీమా కంపెనీలతో పంచుకునేందుకు 70 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. నగదు రహిత ఆస్పత్రి చికిత్సలను 87.9 శాతం మంది కోరుకుంటుండగా, 67.7 శాతం మంది వైద్య బిల్లు రీయింబర్స్‌మెంట్‌ను, 59 శాతం మంది మంచి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యాన్ని కోరుకుంటున్నారు. నాణ్యమైన వైద్య సౌకర్యాలతో కూడిన ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను చూసి ఫలానా పాలసీని తీసుకునే వారు 42.3 శాతం మంది ఉన్నారు. క్లెయిమ్‌ సులభంగా ఉంటుందని ఫలానా కంపెనీ నుంచి పాలసీ తీసుకునే వారు 41.9 శాతం మంది ఉన్నారు. తక్కువ ఖర్చు, మంచి కవరేజీ, ప్రయోజనాలు, సులభ నిబంధనలు, షరతులు వైద్య బీమా కొనుగోలుకు ముందుకొచ్చే వారు చూసే విషయాలు. 20-45 వయసు గ్రూపు వారిలో 38.3 శాతం మంది కనీసం ఓ జీవనశైలి అనారోగ్య సమస్య(బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్‌, అసిడిటీ తదితర)తో బాధపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. గత రెండేళ్లలో జీవనశైలి వ్యాధుల్లో పెరుగుదల ఉంది. చెడ్డ కొవ్వు సమస్య గల వారి సంఖ్య 10.1 శాతం నుంచి 14.1 శాతానికి పెరిగింది. అధిక రక్తపోటు సమస్య 9 శాతం నుంచి 12 శాతానికి చేరింది. జీవోక్యూఐఐ అనేది క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే ఫిట్‌నెస్‌ టెక్నాలజీ కంపెనీ. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Friday 11th January 2019

 ఆసియా మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్న నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. భారత్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానమై సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50 గంటలకు 10,887 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కాగా స్పాట్‌ నిఫ్టీ 10,821 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి నికాయ్‌ 0.7

విదేశీ పెట్టుబడులు తిరిగొస్తాయి: ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ ఏఎంసీ

Friday 11th January 2019

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2018లో ప్రతికూలంగా ఉండడాన్ని చూశాం. డాలర్‌ బలంగా ఉండడం, అమెరికాలో రాబడులు పెరగడం దీనికి ప్రధాన కారణాలు. 2018లో భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిన ఎఫ్‌పీఐలు... ఈ ఏడాది తిరిగి పెట్టుబడులతో మన మార్కెట్లలోకి వస్తారని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ అంచనా వేస్తోంది. 2019లో వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ ఆగి, తిరిగి పెట్టుబడులు

Most from this category