STOCKS

News


జనవరిలో 8.96 లక్షల నూతన ఉద్యోగాలు

Saturday 23rd March 2019
news_main1553324661.png-24762

- 17 నెలల గరిష్టస్థాయికి ఉద్యోగ కల్పన

న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ సంస్థ తాజాగా విడుదలచేసిన డేటా ప్రకారం.. సంఘటితరంగంలో ఈ ఏడాది జనవరిలో 8,96,516 నూతన ఉద్యోగ కల్పన జరిగింది. ఇది ఏకంగా 17 నెలల గరిష్టస్థాయి కాగా.. గతేడాది ఇదేకాలంతో పోల్చితే 131 శాతం వృద్ధి చోటుచేసుకుంది. జనవరిలో 2.44 లక్షల నూతన ఉద్యోగాల్లో 22-25 ఏళ్ల మధ్యవారు ఉండగా, 2.24 లక్షల ఉద్యోగాల్లో 18-21 ఏళ్ల వయస్సువారు ఉన్నట్లు వెల్లడైంది. ఇక సెప్టెంబర్‌ 2017 నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో 76.48 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.



You may be interested

యూనియన్‌ బ్యాంక్‌ ఓపెన్‌ ఆఫర్‌కు మినహాయింపు

Saturday 23rd March 2019

ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చిన సెబీ  న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంక్ విషయంలో ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి మార్కెట్‌ నియంత్రణ సం‍స్థ, సెబీ మినహాయింపునిచ్చింది. యూనియన్‌ బ్యాంక్‌లో ప్రభుత్వం రూ.4,112 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు ప్రతిగా యూనియన్‌ బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. దీంతో యూనియన్‌ బ్యాంక్‌లో ప్రస్తుతం 67.43 శాతంగా ఉన్న ప్రభుత్వం వాటా 6.55 శాతం పెరిగి 73.98 శాతానికి చేరుతుంది. ఫలితంగా టేకోవర్‌

‘డిజిటల్‌ ప్రచార వేదిక.. ‘అప్‌డేట్స్‌’

Saturday 23rd March 2019

‘డిజిటల్‌ ప్రచార వేదిక.. ‘అప్‌డేట్స్‌’ – గతేడాది రూ.10 కోట్ల టర్నోవర్‌  – ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ చైతన్య హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వ్యాపారం, సేవలు దేనికైనా సరే ప్రచారం పకడ్బందీగా లేకపోతే సక్సెస్‌ కాలేవు. రేడియోల నుంచి మొదలైన ప్రచార సరళి కరపత్రాలు, పేపర్లు, టెలివిజన్‌ నుంచి సోషల్‌ మీడియాలోకి విస్తరించింది. ఇంటర్నెట్, మొబైల్‌ పుణ్యమా అని డిజిటల్‌ ప్రచారం జోరందుకుంది. నిజం చెప్పాలంటే ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌ వేదికగా ప్రచార ఉత్పత్తులు,

Most from this category