STOCKS

News


కంపెనీకి సంబంధించి కీలక ఫైనాన్షియల్‌ ఇండికేటర్లు

Saturday 15th September 2018
news_main1536952113.png-20260

స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు, ఎవరో ఒకరు సూచించిన వాటిని కొనుగోలు చేయడం కంటే, తమకు తాముగా పరిశోధన చేసి ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అలాగే, అనలిస్టులు సూచించిన స్టాక్స్‌ విషయంలోనూ కీలక ఆర్థిక గణాంకాలను పరిశీలించి ఇన్వెస్ట్‌ చేయాలా, లేదా అన్నది తమకు తాము నిర్ణయించుకోవచ్చు. ఈ విషయంలో ప్రతీ ఒక్క ఇన్వెస్టర్‌ ఓ కంపెనీకి సంబంధించి చూడాల్సిన ముఖ్యమైన ఫైనాన్షియల్‌ ఇండికేటర్లను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ తెలియజేసింది.  

 

ఎర్నింగ్‌ పర్‌ షేర్‌ (ఈపీఎస్‌)
ఓ కంపెనీ షేరు వారీగా ఎంత లాభం వచ్చిందన్నదే... ఈపీఎస్‌. షేరు ధర ఎంత విలువకు లభిస్తుందో దీని ఆధారంగా అంచనా వేయవచ్చు. దీన్నే ప్రైస్‌ టు ఎర్నింగ్‌ రేషియో అని చెబుతారు. ఆర్జనకు ఎన్ని రెట్లకు లభిస్తుందన్నది. 

 

డెట్‌ టు ఈక్విటీ
కంపెనీలు వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు కొన్ని సందర్భాల్లో అప్పు తెస్తుంటాయి. దీన్ని డెట్‌గా పేర్కొంటారు. వాటాదారులు సైతం పెట్టుబడులు పెడుతుంటారు. దీన్ని ఈక్విటీగా పేర్కొంటారు. డెట్‌ టు ఈక్విటీ అనేది ఈ రెండింటి మధ్య అంతరాన్ని తెలియజేస్తుంది. అధిక డెట్‌ టు ఈక్విటీ అన్నది ఆమోదనీయం కానిది. సులభంగా పాటించతగిన సూత్రం ఓ కంపెనీ రుణ భారం అన్నది ఆ కంపెనీ ఈక్విటీని మించకుండా ఉంటే అది ఆమోదనీయమే. 

 

రిటర్న్‌ ఆన్‌ నెట్‌వర్త్‌
దీన్నే రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ అని కూడా పేర్కొంటారు. ఈక్విటీపై రాబడుల శాతం. ఈ రేషియో ఓ కంపెనీ తన ఈక్విటీపై ఎంత  మేర ప్రతిఫలాన్ని రాబడుతుందో తెలియజేస్తుంది. అధిక రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ రేషియో ఆమోదనీయం. మంచి కంపెనీలు పోటీ కంపెనీలతో పోలిస్తే అధిక రేషియోతో ఉంటాయి.

 

ఆపరేటింగ్‌ మార్జిన్‌
తన ప్రధాన వ్యాపార కార్యకలాపాలపై ఓ కంపెనీ ఎంత మేర మార్జిన్లను రాబడుతుందో తెలియజేస్తుంది. మొత్తం ఆదాయాన్ని ఆపరేటింగ్‌ మార్జిన్‌తో డివైడ్‌ చేస్తే వస్తుంది. అధిక ఆపరేటింగ్‌ మార్జిన్‌ మంచి ఇండికేటర్‌ అవుతుంది. అయితే, అదే సమయంలో ఆయా రంగంలో పరిస్థితి ఎలా ఉందీ చూడాల్సి ఉంటుంది.

 

రెవెన్యూ గ్రోత్‌
ఓ నిర్ణీత కాలంలో కంపెనీ ఆదాయాలు ఎంత వేగంగా వృద్ధి చెందాయన్నది రెవెన్యూగ్రోత్‌ కాలమ్‌ తెలియజేస్తుంది. అధిక వృద్ధి సానుకూల సంకేతం. కంపెనీ కార్యకలాపాల విస్తరణ జరుగుతోందని అర్థం.

 

ఈపీఎస్‌ గ్రోత్‌
ఈపీఎస్‌ వృద్ధి ఓ నిర్ణీత కాలంలో ఎలా ఉందో తెలియజేస్తుంది. ఓ కంపెనీ ఈపీఎస్‌ ఈ ఏడాది రూ.10 నుంచి రూ.12కు పెరిగిందనుకుంటే... అప్పుడు ఈపీఎస్‌ గ్రోత్‌ 20 శాతం అవుతుంది. ఓ రంగంలో మంచి కంపెనీలు పోటీ సంస్థలతో పోలిస్తే అధిక ఈపీఎస్‌ వృద్ధిని నమోదు చేస్తుంటాయి. ఈపీఎస్‌ గ్రోత్‌ తగ్గుతుందంటే అది హెచ్చరికే. 

 

నోట్‌: వ్యాల్యూరీసెర్చ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. కంపెనీ హమ్‌ పేజీలోని సెర్చ్‌ బార్‌లో కావాల్సిన కంపెనీ పేరును టైప్‌ చేసి, సంబంధిత పేజీకి వెళ్లిన తర్వాత, ఫైనాన్షియల్స్‌-యాన్యువల్‌ అనే టాబ్‌ను క్లిక్‌ చేయాలి. అక్కడ ఈ వివరాలు ఉంటాయి.



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐదు ఫండమెంటల్స్‌ పిక్స్‌

Saturday 15th September 2018

మార్కెట్‌ గరిష్ట విలువకు చేరినందున కరెక్షన్‌కు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌జసాని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు... సమర్థవంతమైన యాజమాన్యం, ఆపరేటింగ్‌ మార్జిన్‌ వ్యత్యాసం తక్కువగా ఉండి, ఆదాయ అవకాశాలు మంచిగా ఉన్న నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాలని జసాని సూచించారు. కరెంటు ఖాతా లోటు ఆందోళనలు, వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోవడం, రూపాయి పతనానికి కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందన్న

జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను తగ్గించిన ఫిచ్‌

Saturday 15th September 2018

ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ టాటా మోటార్స్‌ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్‌ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌కు మార్చింది. అయితే బీబీప్లస్‌ను మాత్రం యథాతథంగా కొనసాగించింది. 2010 నుంచి టాటా మోటార్స్‌కు పాడి ఆవుగా మారిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జీఎల్‌ఆర్‌) 2018లో మాత్రం గుదిబండగా మారింది. జూన్‌ క్వార్టర్లో నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. డీజిల్‌ కార్లకు వినియోగదారులు ప్రాధాన్యం తగ్గించడం, బ్రెగ్జిట్‌ (ఈయూ నుంచి బ్రిటన్‌ ఎగ్జిట్‌)

Most from this category