STOCKS

News


మరో 55వేల డొల్ల కంపెనీలు రద్దు..

Saturday 22nd September 2018
news_main1537592423.png-20463

ముంబై: మనీలాండరింగ్‌ని అరికట్టే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా రెండో దశలో 55,000 పైచిలుకు డొల్ల కంపెనీలను మూయించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి. చౌదరి తెలిపారు. మరికొన్ని కంపెనీల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్నింటికి నోటీసులు కూడా పంపినట్లు ఇండో-‍అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల పైగా వార్షిక ఆర్థిక నివేదికలు దాఖలు చేయని 2.26 లక్షల పైగా సంస్థలను తొలి దశలో కేంద్రం రద్దు చేసింది. "తొలి దశలో 2.26 లక్షల కంపెనీలను రద్దు చేశాం. వీటిలో చాలా మటుకు సంస్థలు బోగస్‌వే కాగా.. మిగతావి నిబంధనలను పాటించనివే. దాదాపు 400 కంపెనీలు.. ఒకే గది నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా నమోదు చేయించుకున్నాయి" అని మంత్రి పేర్కొన్నారు. ఇక రెండో దశలో 55,000 పైచిలుకు ఇటువంటి కంపెనీలను రద్దు చేశామని, మరిన్ని సంస్థలు ఈ జాబితాలో చేరనున్నాయని ఆయన వివరించారు. కార్పొరేట్ ముసుగులో మనీలాండరింగ్‌, మాదక ద్రవ్యాలకు నిధుల మళ్లించడం.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే డొల్ల కంపెనీల కేసులపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో)తో పాటు పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని మంత్రి వివరించారు. 



You may be interested

త్వరలో ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ ఐపీఓ

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించనున్నది. ఈ తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద 31.64 లక్షల షేర్లను కూడా ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్‌ చేస్తున్నారు. ప్రమోటర్లు-జనక్‌ షా,

పసిడి కొనుగోళ్లకు తగిన సమయం!

Saturday 22nd September 2018

ముంబై: ప్రస్తుత పరిస్థితులు పసిడి కొనుగోళ్లకు సరైన సమయంగానే కనిపిస్తోంది. విశ్లేషణలోకి వెళితే... పసిడికి పలు దేశాల కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్‌ పటిష్టంగా ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) నివేదిక ఒకటి తాజాగా పేర్కొంది. ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఈ మేరకు విడుదలైన ఒక నివేదికను చూస్తే... ♦ తమ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో పసిడి వాటా పెంచుకోవడంపై కేంద్ర బ్యాంకులు

Most from this category