STOCKS

News


వాల్యూషన్లు ఘనం.. ఎంఎఫ్‌లకు ప్రియం...

Wednesday 3rd April 2019
news_main1554288383.png-24960

యాక్సిస్‌ బ్యాంకు షేరుపై విశ్లేషణ
దలాల్‌ స్ట్రీట్‌లో ప్రస్తుతం బ్యాంకు స్టాకులదే హవా. ఎన్‌పీఏలు తగ్గుముఖం పడుతుండడం, ఎర్నింగ్స్‌పై అంచనాలతో అనలిస్టులు, ఇన్వెస్టర్లు బ్యాంకు స్టాకులపై ఎనలేని మక్కువ చూపుతున్నారు. ఈ కారణంగానే మార్చిలో బ్యాంకు నిఫ్టీ భారీ ర్యాలీ జరిపింది. బ్యాంకు స్టాకులకు ఇలాంటి క్రేజున్న ఈ పరిస్థితుల్లో యాక్సిస్‌ బ్యాంకు షేరు ప్రత్యేకంగా అందరి దృష్టి ఆకర్షిస్తోంది. నెలల వ్యవధిలోనే ఎవరికీ పట్టని దశ నుంచి అందరూ ఇష్టపడే దశకు బ్యాంకు షేరు చేరింది. పీఈ నిష్పత్తి భారీగా పెరిగి వాల్యూషన్ల పరంగా ప్రస్తుతం బ్యాంకు స్టాకులన్నింటిలో అత్యంత ఖరీదైన షేరుగా మారింది. కానీ ఇప్పటికీ ఈ షేరుపై పలువురు అనలిస్టులు పాజిటివ్‌గానే ఉన్నారు. పలు ఫండ్‌ హౌజ్‌లు ఈ షేరును తమ పోర్టుఫోలియోలో మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాయి. దాదాపు 36 ఫండ్‌ హౌస్‌లకు చెందిన 462 స్కీమ్‌ల్లో ఈ షేరుంది. 
వామ్మో వాల్యూషన్లు
ప్రస్తుతం యాక్సిస్‌ బ్యాంకు పీఈ నిష్పత్తి 200 ఉంది. ఇదే సమయంలో ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌బ్యాంకుల పీఈ వరుసగా 75, 55, 31, 14 ఉంది. అక్టోబర్‌ నుంచి బ్యాంకు షేరు 32 శాతం ర్యాలీ జరిపింది. పీఈ వాల్యూ 162 నుంచి 200కు ఎగబాకింది. యాక్సిస్‌ బ్యాంకు ఇంత వాల్యూషన్లతో కొనసాగడం మంచిది కాదని నిపుణుల అంచనా. కానీ బ్యాంకు లాభాలు సరిగా ప్రతిబింబించకపోవడం వల్లనే పీఈ విలువ తేడాగా ఉందని, బ్యాంకు పీఈని పట్టించుకోవాల్సిన పనిలేదని, ప్రైస్‌ టు బుక్‌ వాల్యూ పరంగా స్టాకు సరసమైన ధర వద్దనేఉందని యస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ప్రైస్‌టుబుక్‌ విలువ ఆధారంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు కన్నా యాక్సిస్‌ విలువ డిస్కౌంట్‌లో ఉందని తెలిపింది. ప్రస్తుతం బ్యాంకు పీ టు బీ వాల్యూ 3 వద్ద ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంకులది వరుసగా 6.2, 4.4 వద్ద ఉంది. 
ఎందుకీ జోరు
యాక్సిస్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత క్యు2క్యుకు మెరుగవుతూవస్తోంది. ఈ ధోరణి ఇకముందు కూడా కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఎన్‌పీఏలు టాప్‌అవుట్‌ కావడం, స్లిపేజ్‌లు తగ్గుతుండడం, రికవరీలు పెరగడం.. క్రమంగా బ్యాంకులకు బంగారు భవితను సూచిస్తున్నాయని షేర్‌ఖాన్‌ పేర్కొంది. ముఖ్యంగా యాక్సి్‌స్‌ బ్యాంకు అసెట్‌ క్వాలిటీ విషయంలో చూపుతున్న పురోగతే ఈ షేరుపై కొనుగోళ్ల మక్కువ పెంచుతోంది. బ్యాంకు బుక్‌వాల్యూ పర్‌ షేరు బాగుందని జేఎం ఫైనాన్షియల్స్‌ పేర్కొంది. బ్యాంకు తీసుకునే చర్యలతో ఆర్‌ఓఈ క్రమానుగత పెరుగుదల నమోదు చేయగలదని అంచనా. ఫలితాల మెరుగుదలకు సంబంధించి మేనేజ్‌మెంట్‌ తీసుకుంటన్న శ్రద్ధకారణంగా ఫండ్‌హౌస్‌లు వాల్యూషన్లను పట్టించుకోకుండా షేరును పోర్టుఫోలియోలో కొనసాగిస్తున్నాయి. కోటక్‌ ఇనిస్టిట్యూషన్స్‌ లాంటి కొన్ని సంస్థలు మాత్రం బ్యాంకు పనితీరు, భవితవ్యంపై పాజిటివ్‌గానే వ్యాఖ్యానిస్తూ వాల్యూషన్ల కారణంగా రేటింగ్‌ను కాస్త తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. షేరు వాల్యూలో కన్సాలిడేషన్‌, ఫలితాల్లో పురోగతి కనిపిస్తే మరలా షేరు చెలరేగిపోతుందని ఎక్కువమంది అభిప్రాయం. You may be interested

మార్కెట్లపై నిపుణుల విశ్లేషణలు

Thursday 4th April 2019

నిఫ్టీ నూతన జీవితకాల గరిష్ట స్థాయి 11,761ను బుధవారం ఇంట్రాడేలో నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మార్కెట్‌ గమనంపై బీఎస్‌ఈ సభ్యుడు రమేష్‌ దమాని, మారథాన్‌ ట్రెండ్స్‌ పీఎంఎస్‌ సీఈవో అతుల్‌ సూరి తమ విశ్లేషణను ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.   రైలు స్టాక్స్‌ చౌక ‘‘బుల్‌ మార్కెట్లో భాగంగానే డిసెంబర్‌, జనవరిలో బలమైన దిద్దుబాటు జరిగిందని నేను చెబుతూనే ఉన్నాను. బుల్‌ మార్కెట్‌కు ఇది విరామమే కానీ, బుల్‌ మార్కెట్‌కు ముగింపు

రికార్డు ర్యాలీకి బ్రేక్‌

Wednesday 3rd April 2019

39000 దిగువకు సెన్సెక్స్‌ 11650 మార్కును కోల్పోయిన నిఫ్టీ స్టాక్‌ మార్కెట్లో సూచీల రికార్డు పరంపరకు బుధవారం బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులు నుంచి మంచి జోరు మీద ఉన్న బుల్స్‌ నేటి మిడ్‌సెషన్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ఫలితంగా మార్కెట్‌ నాలుగురోజుల ర్యాలీ ముగింపు పలుకుతూ నష్టాల్లో ముగిసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 179.53 పాయింట్లు నష్టపోయి 39000ల దిగువున 38,877 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 69

Most from this category