STOCKS

News


భారత్‌లో 38 శాతం బ్రిటన్‌ కంపెనీల పెట్టుబడులు

Wednesday 12th December 2018
news_main1544591967.png-22850

న్యూఢిల్లీ: బ్రిటన్‌ కంపెనీల్లో 38 శాతం 2017లో భారత్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాయి. 2016-18 మధ్య ప్రైవేటు రంగంలో 51,118 ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అంతకుముందు 18 నెలల కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ‘స్టెర్లింగ్‌ అసెట్స్‌-బ్రిటన్‌ మీట్స్‌ ఇండియా’ నివేదిక తెలియజేసింది. భారత్‌లో బ్రిటన్‌ తన పెట్టుబడులను ఇతోధికం చేయడం ద్వారా అతిపెద్ద పాశ్చాత్య ఇన్వెస్టర్‌గా నిలిచినట్టు పేర్కొంది. బ్రిటన్‌ కంపెనీలు భారత్‌లో గత శతాబ్దకాలంలో 4,22,000 ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపింది. ‘‘2000-2018 మధ్య బ్రిటన్‌లోని అన్ని వాహకాల ద్వారా వచ్చిన పెట్టుబడులు 50.57 బిలియన్‌ డాలర్లు. ఇందులో బ్రిటన్‌ నేరుగా చేసిన పెట్టుబడులు 26.09 బిలియన్‌ డాలర్లు. భారత్‌లో బ్రిటన్‌ నాలుగో అతిపెద్ద ఇన్వెస్టర్‌. భారత్‌లోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 7 శాతం వాటాకు ప్రాతినిధ్యం వహిస్తోంది’’ అని ఈ నివేదిక పేర్కొంది. 



You may be interested

ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్‌ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్‌ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్‌ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి

జేఎల్‌ఆర్‌ ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ విడుదల

Wednesday 12th December 2018

 న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా (జేఎల్‌ఆర్‌).. ‘2019 డిస్కవరీ స్పోర్ట్‌’ పేరుతో నూతన వేరియంట్‌ ఎస్‌యూవీని మంగళవారం విడుదలచేసింది. నూతన ఫీచర్లు, 2.0 లీటర్ల ఇంజినియం డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.44.68 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరీ మాట్లాడుతూ.. ‘మెరుగైన పవర్‌ట్రైన్ ఆప్షన్‌ ఉండడం

Most from this category