STOCKS

News


భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం

Thursday 14th March 2019
news_main1552546567.png-24602

30 బిలియన్‌ డాలర్లకు 
భారత్‌–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం

గతేడాది ఇండియా, రష్యా ఇరు దేశాల మధ్య 11 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని.. 2025 నాటికిది 30 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని రష్యాలోని టాంస్క్‌ రీజియన్‌ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌ఈ ఆండ్రూ ఆంటనోవ్‌ అంచనా వేశారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తులు, మైనింగ్, మిషనరీ బిల్డింగ్, న్యూక్లియర్, ఫార్మా, మెటల్‌ ఉత్పత్తులు భారత్‌తో పాటూ 48 దేశాలకు ఎగుమతి అవుతుంటాయని తెలిపారు. ఎగుమతుల్లో ప్రధానంగా 27 శాతం రసాయన ఉత్పత్తులు, 23 శాతం మిషనరీ బిల్డింగ్‌ ఉత్పత్తులుంటాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఎఫ్‌ట్యాప్సీ ఆధ్వర్యంలో ‘‘హై లెవల్‌ బిజినెస్‌ డెలిగేషన్‌ ఆఫ్‌ రష్యన్‌ ఫెడరేషన్‌’’ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్‌టీఏపీసీసీఐ ప్రెసిడెంట్‌ సీఏ అరుణ్‌ లుహారియా మాట్లాడుతూ.. ఏటా మన దేశం నుంచి రష్యాకు 2.1 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు, రష్యా నుంచి మన దేశానికి 8.6 బిలియన్‌ డాలర్ల దిగుమతులు జరుగుతుంటాయని తెలిపారు. 2018–19లో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నాటికి 3.3 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని చెప్పారు. మన దేశం నుంచి రష్యాకు ప్రధానంగా ఫార్మా, న్యూక్లియర్‌ ఉత్పత్తులు, ఆర్గానిక్‌ కెమికల్స్, రైస్‌ వంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. మినరల్స్, ఆయిల్స్, సహజ వాయువులు, విలువైన రాళ్లు, మెటల్స్, ఎరువులు వంటివి దిగుమతి అవుతున్నాయని తెలిపారు.
టీఎస్‌ఐఐసీలో 150000 ఎకరాల స్థలం...
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఈవీ నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా, ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్, టూరిజం, లాజిస్టిక్, తయారీ రంగాల్లో తెలంగాణ, టాంస్క్‌ రీజియన్‌లకు సారుప్యమైన వ్యాపార అవకాశాలున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్‌ తయారీలో మూడింట ఒక వంతు వ్యాక్సిన్స్‌ తెలంగాణలో ఉత్పత్తి అవుతాయని.. దేశంలో ఉత్పత్తి అయ్యే బల్క్‌ డ్రగ్స్‌లో మూడింట ఒక వంతు బల్క్‌ డ్రగ్స్‌ హైదరాబాద్‌ నుంచే అవుతున్నాయని తెలిపారు. అందుకే ఈ రెండు రంగాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంల్తైనా ఉందని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ పరిశ్రమల స్థాపన కోసం 150000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. ఫుడ్, ఆగ్రో ప్రాసెసిం గ్‌ యూనిట్ల ఏర్పాట్ల కోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలతో పాటూ ల్యాండ్, వాటర్, కరెంట్‌లను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాంస్క్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌ మరీనా ఉస్కోవా, రష్యా ఫెడరేషన్‌ ట్రేడ్‌ కమీషనర్‌ హెచ్‌ఈ యరోస్లావ్‌ టారాస్విక్‌ పాల్గొన్నారు. You may be interested

ఈకామర్స్ సంస్థలకూ అసోసియేషన్‌

Thursday 14th March 2019

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ సంస్థలు తాజాగా ది ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీఈసీఐ) ఏర్పాటు చేసుకున్నాయి. స్నాప్‌డీల్‌, షాప్‌క్లూస్‌, అర్బన్‌క్లాప్ తదితర సంస్థలు కలిసి దీన్ని నెలకొల్పాయి. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా దేశీ సంస్థలు కూడా రాణించేందుకు, దేశీ ఈ-కామర్స్ రంగం వృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి తోడ్పడే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్నాప్‌డీల్ సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. డేటా ప్రైవసీ, లాజిస్టిక్స్‌, పేమెంట్స్

మధుకాన్‌ కంపెనీలపై సీబీఐ కేసు

Thursday 14th March 2019

రూ.1,000 కోట్లకుపైగా మోసం ప్రమోటర్లపైనా కేసు నమోదు బ్యాంకులను మోసం చేసినందుకే టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావుకు చెందిన మౌలిక రంగ కంపెనీ మధుకాన్‌పై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులకు మోసపూరితంగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం కలిగించినందుకు ఈ కేసు నమోదైంది. జార్ఖండ్‌లో  ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించిన రోడ్డు విస్తరణ ప్రాజెక్టును పూర్తి చేయకపోగా.. ప్రాజెక్టు కోసం మంజూరైన కోట్లాది రూపాయల

Most from this category