STOCKS

News


2019లో సంపద సృష్టి ఎంతో ఈజీ!

Thursday 25th April 2019
news_main1556162801.png-25340

కష్టమేనన్న ఎక్కువ మంది
న్యూఢిల్లీ: ఎన్నికల ఏడాదిలో సంపద సృష్టికి మెండుగా అవకాశాలున్నాయనే ఆశావహ పరిస్థితి దేశంలోని అత్యధిక సంపన్నుల్లో వ్యక్తమవుతోంది. 28 శాతం మంది అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇది అంతర్జాతీయ సగటు 12 శాతం కంటే రెట్టింపు అని నైట్‌ఫ్రాంక్‌ సర్వే వెల్లడించింది. ఈ సంస్థ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐల దృక్పథాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించింది. ఎన్నికల సంవత్సరం అయినప్పటికీ అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు దేశ వృద్ధి ప్రయాణం పట్ల, సంపద వృద్ధి పట్ల ఎంతో ఆశావహ స్థితితో ఉన్నారని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ఎన్నో ఆర్థిక సంస్కరణలతో దేశంలో ఏర్పాటైన బలమైన ఆర్థిక మూలాలే ఇందుకు ఆధారమని అభిప్రాయపడింది.
సర్వేలో అంశాలు 
- దేశంలో ఆర్థిక, రాజకీయ అంశాలు ఈ ఏడాది సంపద సృష్టికి అనుకూలంగా ఉంటాయని ఈ సర్వేలో 28 శాతం మంది భారతీయులు చెప్పారు. గతేడాది ఇదే తరహా అభిప్రాయంతో ఉన్న వారి కంటే ఈ ఏడాది 3 శాతం మంది పెరిగారు. 
- 36 శాతం మంది మాత్రం సంపద సృష్టి కష్టమేనని తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా 68 శాతం సగటు కంటే తక్కువ మందే ఇలా చెప్పడం సానుకూలతగా సర్వే పేర్కొంది. 
- దేశంలో సంపద సృష్టితోపాటు దానిని కాపాడుకోవడం ఈ ఏడాది కష్టతరం కావచ్చని 56 మంది చెప్పడం విశేషం. 



You may be interested

‘లీలా’హోటళ్ల విక్రయానికి సెబీ బ్రేక్‌

Thursday 25th April 2019

హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల  అమ్మకం వ్యవహారం  న్యూఢిల్లీ: హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల, ఇతర ఆస్తుల విక్రయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ విక్రయాలను నిలిపేయాలని  సెబీ ఆదేశాలు జారీ చేసిందని హోటల్‌ లీలా వెంచర్‌ బుధవారం వెల్లడించింది. మరోవైపు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై ధర్మాసనం హోటల్‌ లీలా వెంచర్‌కు, ఈ కంపెనీ ప్రమోటర్లకు, ఈ కంపెనీ రుణదాత జేఎమ్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Thursday 25th April 2019

ప్రధాన ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ,క్రితం రోజు భారీగా పెరిగిన భారత్‌ మార్కెట్‌ గురువారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.40  గంటలకు 4 పాయింట్ల లాభంతో11,730 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌ ఫ్యూచర్‌ 11,726 పాయింట్ల వద్ద ముగిసింది.  బుధవారం రాత్రి అమెరికా సూచీలు నష్టాలతో ముగిసాయి. తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌,  తైవాన్‌ సూచీలు మినహా మిగిలినవి కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Most from this category