STOCKS

News


జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్‌...

Tuesday 1st January 2019
news_main1546319551.png-23342

న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి 23 వస్తుసేవలపై తగ్గించిన జీఎస్‌టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. డిసెంబర్‌ 22న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌లో 23 రకాల వస్తు సేవలపై జీఎస్‌టీ శ్లాబులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో సామాన్యుడికి అవసరమైన పలు వస్తు సేవల ఖరీదు తగ్గనుంది. పన్ను తగ్గింపుతో సినిమాటికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిలవచేసిన కూరగాయలు ఇకపై చౌకగా లభిస్తాయి.పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన జాబితాలో కప్పీలు, ట్రాన్స్‌మిషన్‌ షాఫ్ట్‌, పునర్వినియోగ టైర్లు, లిథియం అయాన్‌ పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరా రికార్డర్‌లు, వీడియో గేమ్‌ పరికరాలున్నాయి. దివ్యాంగుల ఉపకరణాలపై ప్రస్తుతం అమలవుతున్న పన్నును 28 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. సరకు రవాణా వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అత్యల్ప పన్ను శాతమైన 5 శాతం శ్లాబులోఊత కర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలు, సహజ బెరడు, చలువరాళ్లను చేర్చారు. పుణ్యక్షేత్రాలకు ప్రభుత్వం సమకూర్చే నాన్‌–షెడ్యూల్డ్, చార్టర్డ్‌ విమానాల సేవలపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పునర్వినియోగ ఇంధన ఉపకరణాలు, వాటి తయారీపై కూడా 5 శాతం పన్ను విధించారు. శీతలీకరించిన, ప్యాక్‌ చేసిన కూరగాయలతో పాటు రసాయనాలతో భద్రపరచిన, తక్షణం తినడానికి సిద్ధంగా లేని కూరగాయలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. జన్‌ధన్‌ యోజన ఖాతాదారులకు బ్యాంకులు అందించే సేవలను కూడా పన్ను పరిధి నుంచి తప్పించారు.


GST

You may be interested

కొత్త ఏడాదికి ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సులు

Tuesday 1st January 2019

నూతన సంవత్సరంలో మంచి రాబడులిచ్చే ఏడు స్టాకులను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యాక్సిస్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 755. స్టాప్‌లాస్‌ రూ. 569. నాలుగు సంవత్సరాల సౌష్ఠవాకార త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం రూ. 580 వద్ద బలమైన మద్దతు స్థాయి ఏర్పరుచుకుంది. గత అప్‌మూవ్‌కు 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి 770 రూపాయల వరకు అప్‌మూవ్‌ కొనసాగవచ్చు. 2. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ.

బ్యాంకింగ్‌ రంగంలో రికవరీ షురూ

Tuesday 1st January 2019

- ఎన్‌పీఏలు తగ్గుతున్నాయ్‌ - పీఎస్‌బీల్లో మరిన్ని సంస్కరణలు అవసరం - ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ - అర్ధ సంవత్సర ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల ముంబై: పేరుకుపోయిన మొండిబకాయిలు తగ్గుతుండడంతో బ్యాంకింగ్‌ రంగం ఊపిరి పీల్చుకుంటోందని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. బ్యాంకింగ్‌ రంగం రికవరీ బాట పట్టినా, పీఎస్‌యూ బ్యాంకుల్లో పాలనా పరంగా మరిన్ని సంస్కరణలు రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆర్‌బీఐ అర్ధ వార్షిక ఆర్థిక స్థిరత్వ నివేదికను

Most from this category