STOCKS

News


టాటా ‘హారియర్‌’ వచ్చేసింది

Thursday 24th January 2019
news_main1548303584.png-23765

  •  ప్రారంభ ధర రూ.12.69 లక్షలు

ముంబై: కారు ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘టాటా హారియర్‌’ బుధవారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ల్యాండ్‌ రోవర్‌ డీ8 ప్లాట్‌ఫాంపై రూపొందిన ఈ సరికొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ).. మొత్తం 4 వేరియంట్లలో లభ్యమవుతోంది. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌, సింగిల్ పవర్‌ట్రెయిన్ ఈ కారు ప్రధాన ఫీచర్లు. ‘ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్‌’ మోడళ్లను హారియర్‌ విభాగంలో కంపెనీ విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ.12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల మధ్య ఉన్నట్లు ప్రకటించింది. ఇంపాక్ట్ డిజైన్ 2.0 ఆధారంగా రూపొందించిన తొలి కారు ఇదేనని సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ విభాగం) మయాంక్ పరీఖ్ మాట్లాడుతూ.. ‘ల్యాండ్‌ రోవర్‌ డీ8 నుంచి గ్రహించిన ఒమేగా ఆర్కిటెక్చర్‌పై కారు రూపొందింది. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణల ద్వారా కంపెనీ ప్యాసింజర్‌ వాహన విభాగం మరింత బలపడనుంది. టర్న్అరౌండ్ 2.0 ప్రణాళికలో భాగంగానే హారియర్‌ను విడుదలచేశాం.’ అని వ్యాఖ్యానించారు.



You may be interested

మార్కెట్లోకి నూతన ‘వ్యాగన్‌ఆర్‌’

Thursday 24th January 2019

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన వ్యాగన్‌-ఆర్‌ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్ న్యూ వ్యాగన్ఆర్’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1-లీటర్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.4.89లక్షలు–రూ.5.69 లక్షలు. 1-లీటర్ ఇంజిన్‌ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 24th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావిత‌య్యే షేర్ల వివ‌రాలు అపోలో మెక్రో సిస్టమ్స్‌:- భార‌త్ డైన‌మిక్స్ నుంచి  రూ.13 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. ఐడీబీఐ బ్యాంక్‌:- ఎల్ఐసీ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన త‌ర్వాత మూడీస్ రేటింగ్ కంపెనీ ఐడీబీఐ బ్యాంక్ రేటింగ్ను బీ1 నుంచి బీఏ2 కు   అప్ గ్రేడ్ చేసింది. ఎవ‌రెస్ట్ ఇండ‌స్ట్రీస్‌:- కంపెనీ ఛైర్మన్ ప‌ద‌వికి ఆదిత్య విక్రమ్ సోమ‌ని రాజీనామా చేశారు. వోడాఫోన్ ఐడియా:- అర్హత క‌లిగిన ఈక్వీటీ షేర్‌హోల్డర్లకు

Most from this category