STOCKS

News


రెనో క్విడ్‌ @ రూ.2.67 లక్షలు

Tuesday 5th February 2019
news_main1549346993.png-24019

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఆటో దిగ్గజం రెనో..  తన ఎంట్రీ లెవల్‌ కారు ‘క్విడ్’ను మరిన్ని భద్రతా ఫీచర్లతో సోమవారం భారత మార్కెట్లో  ప్రవేశపెట్టింది. ఈ నూతన వేరియంట్‌ ధరల శ్రేణి రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా ప్రకటించింది. కొత్త క్విడ్‌.. 0.8 లీటర్, 1 లీటరు పెట్రోల్ ఇంజిన్లలో మాన్యువల్, ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ ఆప‍్షన్లలో అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌.. డ్రైవర్‌, కో-డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఈకారులో ఉన్నట్లు రెనో ప్రటించింది. ఇక ఇతర పరమైన ఫీచర్ల విషయానికి వస్తే.. 17.64 సెం.మీ టచ్‌ స్క్రీన్‌ మీడియా, నావిగేషన్ సిస్టం ఈకారులో ఉన్నట్లు తెలిపింది.



You may be interested

మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు

Tuesday 5th February 2019

ఈ క్యూ3లో రూ.4,185 కోట్ల నష్టాలు 19 శాతం తగ్గిన నికర వడ్డీ ఆదాయం పెరిగిన మొండి రికవరీలు న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో  రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా

ఏప్రిల్‌ నుంచి డిజిన్వెస్ట్‌మెంట్‌

Tuesday 5th February 2019

ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 24 కంపెనీల్లో వాటాల అమ్మకం ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌, బీఈఎంఎల్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించినట్టు ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. ఎయిర్‌ ఇండియా, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ (బీఈఎంఎల్‌) సహా రెండు డజన్ల కంపెనీల్లో వాటాలను విక్రయించేందుకు కేంద్ర కేబినెట్‌ ఇప్పటికే

Most from this category